మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 24 : అర్హులందరూ తమ వివరాలను సర్‌లో సక్రమంగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ ఆయన నివాసంలో బూత్‌స్థాయి అధికారికి తన ఎన్యూమరేషన్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సర్‌కు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలు సహరించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో పేరు లేకుండా ఉండకూడదన్నారు.
ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయించాలని సూచించారు. ఉపాధి, విద్య తదితర కారణాలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గుర్తించి వారి అర్హతను పరిశీలించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో కొత్తగా 18ఏళ్లు నిండిన యువత, పెళ్లి పేరుతో చిరునామా మారిన మహిళలు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కానీ అర్హులందరిని గుర్తించి నమోదు చేయాలని ఆయన సూచించారు.