మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 5: హైదరాబాద్ తరహాలో మహబూబ్‌నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆర్అండ్బీ వద్ద మంగళవారం రూ.81.51లక్షల వ్యయంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకీ కేటాయించిన రోడ్డును శుభ్రం చేసే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి చేశామని, ట్యాంక్‌బండ్ సుందరీకరణ, శిల్పారామం ఏర్పాట్లు చేస్తున్న్తామని తెలిపారు. రోడ్డును శుభ్రం చేసే వాహనంతో గంటకు 5 నుంచి 7కిలో మీటర్ల మేర రహదారిని శుభ్రం చేయవచ్చన్నారు. ఈ వాహనంలో దుమ్ము సేకరించేందుకు 6వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్పేయర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ రోడ్లు శుభ్రం చేయడంతోపాటు పారిశుధ్య సిబ్బందికి పనిభారం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషల్ కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు కట్టారవికిషన్‌రెడ్డి, నీరజ, అనంతరెడ్డి, గోవిందు, మాజీ కౌన్సిలర్లు గంజివెంకన్న, విఠల్‌రెడ్డి, శివశంకర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.