మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 20 : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ మంత్రి, ఓ బీసీ జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగళూర్ ప్యాలెస్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఓబీసీ జాతీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.
బడుగుల బతుకులు మారాలంటే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కులగణన చేపట్టి ఎవరి వా టా ఎంటో తేల్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులను తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, పార్లమెంట్లో బిల్లును చట్ట సవరణ చేయాలన్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. 42శాతం రిజర్వేషన్లు అ మలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజే హరిప్రసాద్, ఎమ్మెల్సీ మల్కయ్య, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ నర్సయ్య, బాల్‌రాజ్, ఓబీసీ కర్ణాటక అధ్యక్షుడు గోపి, బెంగళూర్ ఓబీసీ అధ్యక్షుడు భాస్కర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.