పాలమూరు, ఆగస్టు 28 : జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో గల కృష్ణదేవాలయం, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లో బుధవారం శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భజన మండ లి ఆధ్వర్యంలో పల్లకీసేవ వైభవంగా చేపట్టారు.
అనంతరం ఉట్ల ఉత్సవాలను పద్మావతికాలనీలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ ప్రారంభించారు. అదేవిధంగా లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వామివారికి పల్లకీసేవ అనంతరం ఉట్లకు పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రాంభించారు. ఉత్సవాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొని ఉట్లు కొట్టారు. కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.