ఫుట్‌బాల్ అకాడమీకి కృషి
మహబూబ్‌నగర్‌లో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. స్థానిక బాలుర కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న పీర్ హషీం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు మంత్రి హాజరై ప్రారంభించి మాట్లాడారు.
- రాష్ట్రస్థాయి క్రీడలకు వేదికగా పాలమూరు
- గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
- ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- భజరంగ్‌దళ్ అధ్యక్షుడికి ఆర్థికసాయం
- రాష్ట్రస్థాయి క్రీడలకు వేదికగా పాలమూరు
- ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- కాళికాదేవి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు
- భజరంగ్‌దళ్ అధ్యక్షుడికి ఆర్థికసాయం
మహబూబ్‌నగర్‌టౌన్/పాలమూరు, డిసెంబర్ 11: మహబూబ్‌నగర్‌లో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. స్థానిక బాలుర కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న పీర్ హషీం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు మంత్రి హాజరై ప్రారంభించి మాట్లాడారు. గతంలో బాలుర కళాశాల మైదానంలో కనీసం గ్రౌండ్ కూడా ఉండేదికాదని, అలాంటిది స్టేడియం ఏర్పాటు చేశామన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కూడా స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు నిర్మించామని, ఇప్పటివరకు 7600గ్రామాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడలకు పాలమూరు వేదికగా మారిందన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీలకు వెళ్లే క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం నసరుల్లాబాద్ జెడ్పీహెచ్ఎస్, రాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ జట్ల మధ్య మ్యాచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షబ్బీర్, నాయకులు షఫీ, ముంజిమిల్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
కాళికాదేవికి మంత్రి పూజలు
మహబూబ్‌నగర్ మండలం రాంచంద్రపురంలోని కాళికాదేవి ఉత్సవాల్లో ఆదివారం ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సిడెకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, కోటకదిర పీఏసీసీఎస్ చైర్మ న్ రాజేశ్వర్‌రెడ్డి, సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివప్రసాద్‌యాదవ్, భక్తులు పాల్గొన్నారు.
భజరంగ్‌దళ్ అధ్యక్షుడికి ఆర్థికసాయం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 11: భజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ బ్రెయిన్‌స్ట్రోక్‌తో జిల్లాకేం ద్రంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం దవాఖానకు వెళ్లి పరామర్శించారు. వైద్యం కోసం రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. మెరుగైన వైద్యం అందించి శ్రీకాంత్ వెంటనే కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే మంత్రి తమకు అండగా ఉండడం తమ అదృష్టమని స్థానికులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

