ఊట్కూర్ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీర దారుఢ్యాన్ని పెంచుతాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అమీన్పూర్ గ్రామంలో ప్రీమియం లీగ్ సీజన్ వన్ క్రికెట్ మ్యాచ్ను ( Cricket Match) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరిస్తేనే అనుకున్న లక్ష్యానికి చేరువవుతారని సూచించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి స్నేహపూర్వకంగా మెదగాలని సూచించారు. స్వర్గీయ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పీఎసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి జ్ఞాపకార్థం మొదటి బహుమతి రూ. 22, 222 ని ఆయన కుమారులు సుధాకర్ రెడ్డి, శివారెడ్డి, రామ్ రెడ్డి ప్రకటించారు.
ద్వితీయ బహుమతి రూ. 11,111 నగదును స్వర్గీయ హన్మిరెడ్డి జ్ఞాపకార్థం కుమారులు రవీందర్ రెడ్డి, ఆశి రెడ్డి వితరణ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, మహమ్మద్ షఫీ, బాబు, అంజప్ప, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.