తలాపున కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా.. సాగునీళ్లు లేక నెర్రెలిచ్చిన భూ ములకు జవసత్వాలు రానున్నాయి. చుక్క నీరు లేక నోరెళ్లబెట్టిన బా వులు.. భూగర్భ జలాల జాడలేక ఎండిన బోర్లకు పాలమూరు ప్రా జెక్టు వరప్రదాయినీగా మారనున్నది. అపర భగీరథుడిలా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముందుచూపుతో పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. 2015లో పైలాన్‌ను ఆవిష్కరించగా.. నేడు పనులు చివరి దశకు చేరాయి. నార్లాపూర్ సమీపంలో లిఫ్ట్-1 వద్ద 16న వెట్న్‌న్రు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీంతో సుర‘గంగ’ ఉప్పొంగనుండగా.. సు‘జల’ సంకల్పం నెరవేరనున్నది. కాగా సాగునీరు పారే అవకాశంలేని నారాయణపేట జిల్లాలో సైతం సాగునీరు పారనున్నది. నాడు వలసలకు కేరాఫ్‌గా ఉన్న జిల్లా త్వరలో సస్యశ్యామలం కానున్నది. కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నుంచి నీటిని పారించేలా కాల్వలను నిర్మించనున్నారు. దీంతో బీడు భూముల్లో జలసిరులు సంతరించుకొని దాదాపు లక్ష ఎకరాలు సాగులోకి రానున్నాయి. జిల్లా విధిరాతను మార్చడానికి ప్రగతి ప్రదాత కంకణం కట్టుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటి ఆశలతో నీటి రాక కోసం ఎదురుచూస్తున్నారు.
కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 13 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, దీనిని అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు ఈఎన్సీ మురళీధర్‌రావు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును ఈఎన్సీ, ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డితో కలిసి బుధవారం సందర్శించారు. శనివారం సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న తరుణంలో పంప్‌హౌస్‌లోని కంట్రోల్ రూం, సర్జ్‌పూల్, డెలివరీ సిస్టర్న్‌లను పరిశీలించి ప్రాజెక్టు అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటి ప్యాకేజీ వద్ద స్టాండ్ బై మోటర్తో కలిపి తొమ్మిది పంప్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈఎన్సీ వెంట ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరావు, రవీంద్ర, పార్థసారధి, దయానంద్, డీఈ అమర్‌సింగ్ తదితరులున్నారు.