అచ్చంపేట, మార్చి 7 : ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరింది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన క్యాడవర్ డాగ్స్లతో శుక్రవారం ఉదయం 7:30 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు తవ్వేందుకు అవసరమైన సామాగ్రితో 110 మంది టన్నెల్లోకి వెళ్లారు. మృతదేహాలను గుర్తించేందుకు రెస్యూ బృందాలు అనేక విధాలుగా కృషి చేసినా కార్మికుల ఆచూకీ లభించడం లేదు.
పోలీసుల వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలు, జీపీఆర్ డేటా ఆధారంగా చర్యలు చేపట్టి తవ్వకాలు జరిపారు. అయినా ఎ లాంటి ఆనవాళ్లు లభించలేదు. ఇక బెల్జియం మ్యా ల్నోయిస్ బ్రిడ్కు చెందిన క్యాడవర్ శునకాలు 15 ఫీట్ల లోపల ఉన్నా మృతదేహాలను గుర్తించడం వీటి ప్రత్యేకత. బురద అధికంగా ఉండడంతో ఇవి కూడా గుర్తించలేకపోయాయి. దీంతో ప్రభుత్వం రోబోలను రంగంలోకి దింపాలని భావించింది. అందులో భాగంగానే ఉదయం 11:25 గంటలకు నలుగురు సభ్యులతో కూడిన అన్వి(ఎఎన్వీఐ) రోబోటిక్ నిపుణుల బృందం టన్నెల్లోకి వెళ్లింది. లోపల ఇప్పటికి కనిపించకుండాపోయిన కార్మికుల మృతదేహాలను గుర్తించేందుకు వేట కొనసాగిస్తున్నారు.
రోబోటిక్ నిపుణులు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ మరోసారి టన్నెల్లోకి వెళ్లారు. మధ్యాహ్నం బయటకు వచ్చిన క్యాడవర్ డాగ్స్లు మూడు ప్రదేశాలను గుర్తించా యి. ఐదు రోజుల కింద జీపీఆర్ డాటా ఆధారంగా గు ర్తించిన మూడు ప్రదేశాల నే క్యాడవర్ డాగ్స్ గుర్తించినట్లు స్కాడ్ బృందం ప్రతినిధులు తెలిపారు. జీపీఆర్ డాటా ఆధారంగా ప్రదేశాల్లో తవ్వకాలు జ రుపుతున్నా అక్కడ నీళ్లు, బు రద కారణంగా తవ్వకాలకు ఇ బ్బందిగా మారిందని అంటున్నా రు. టీబీఎం కిందిభాగంలో కూడా తవ్వకాలు జరపాల్సి ఉన్నందునా ముందుగా మిషన్ పరికరాలు కటింగ్ చేసి పక్కకు తీసిన తర్వాత అక్కడ తవ్వకాలు జరిపే వీలుంటుందని పేర్కొంటున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మూడు ప్రదేశాలలో మృ తదేహాలు ఖచ్చితంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
సొరంగంలోని కన్వేయర్ బెల్టు ఇంకా వినియోగంలోకి రాలేదు. రెస్యూ బృందాలు బెల్టును మరమ్మతులు చేస్తున్నారు. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్ ద్వారా కటింగ్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు. అయితే జియాలజికల్ సర్వే బృందం మూడు రోజులుగా మల్లెలతీర్థం, తాటిగుండాలు, పోసనిగుట్ట అడవీ ప్రాంతంలో తిరిగి సర్వే చేశారు. సొరంగం వెళ్తున్న ప్రదేశాల్లో మరేమైనా నీటి జలాలు, మట్టి లూజుగా ఉండడం, మరేమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటూ పరిశీలించారు. శనివారం హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టన్నెల్లో జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షించనున్నారు. అనంతరం రెస్యూ బృందాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డోగ్ర రెజిమెంట్ కమాండెంట్ పరిక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
సొరంగంపై భాగంలో నల్లమల్ల అటవీ ప్రాం తంలో నేషనల్ జియోలాజికల్ సర్వే టీం అటవీ శాఖ అధికారులతో కలిసి ముమ్మరంగా అన్వేషిస్తుంది. ఇక్కడి నుంచి నీటి ధారాలు సొరంగంలోకి వెళుతున్నాయో? ఆ ప్రదేశాన్ని గుర్తించేందుకు జల్లెడ పడుతున్నాయి. పైనుంచి నీటిని మళ్లించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్కడ కూడా ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ప్ర మాదం జరిగిన చోట సొరంగ మార్గం మరింత ప్రమాదకరంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. గంటగంటకూ ఉబికి వస్తున్న నీటి ఊటతోపాటు బురద కూడా తోడై సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నాయి. ప్రాణాలకు తెగించి స హాయక చర్యల్లో పాల్గొంటున్న వారి ప్రాణాలకు ముప్పుందని భావించిన సర్కారు రోబోల సహాయంతో కార్మికుల ఆచూకీ కనుక్కోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నది.