SLBC Tunnel | మహబూబ్‌నగర్ ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దోమల పెంట/అమ్రాబాద్ : నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగి ఎనిమిది రోజుల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణమైనా లోపల ఉన్న వారిని బయటికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిగ్గా వారం రోజుల కిందట ఈ ప్రమాదం జరగగా శుక్రవారం కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని ఐడెంటిఫై చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ బృందాలు ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వద్దకు వెళ్లి జీపీఆర్ స్కానింగ్ చేపట్టారు. ఈ స్కానింగ్ రిపోర్టులను పరిశీలించిన నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఏజెన్సీ ఐదు స్పాట్లలో కార్మికులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది.
ఈ స్పాట్లలో మార్కింగ్ చేసిన అనంతరం సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్ఐ, ఆర్మీ, నే వీ, సింగరేణి బృందాలను లోపలికి పంపించారు. సొరంగం సమీపంలో అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఎస్ఎల్బీసీ ట న్నెల్ వద్ద ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా ఉండగా మీడియాలో వస్తున్న కథనం పూర్తిగా నిరాధారమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ ఖండించారు. కాగా సింగరేణి తరఫున సహాయక చర్యల ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సీఎండీ బల రాం మాత్రం ఎన్డీఆర్ఐ స్పాట్లను గుర్తించిన సమాచారం వాస్తవమేనని వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాద సంఘటనను పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి డుమ్మా కొట్టారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే అవకాశం ఉండడం తో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఉన్న తాధికారుల ఆదేశం మేరకు అంబులెన్స్‌లు రెడీ చేసి ఉంచారు. సాయంత్రం నుంచి ప ని బృందాలు సొరంగం లోపలికి వెళ్లి వస్తున్నాయి. గుర్తించిన స్పాట్లను మార్కింగ్ చేసి ఆ ప్రదేశాల్లో బురదలు తొలగిస్తున్నా రు. కాగా అక్కడే టీబీఎం మిషన్ ముందు భాగం పడి ఉంటుందని అంచనా వేస్తున్నా రు. ఒక్కసారిగా సొరంగం కుప్పకూలి టీబీఎం మెషిన్ ముక్కలైందని.. దాని ము ందు భాగంలోని ఎనిమిది మంది కార్మికు లు చిక్కుకొని ఉంటారని ముందు నుంచే అంచనాకు వచ్చారు. తాజాగా ఎన్జీఆర్ఐ కూడా ఇదే స్పాట్లను ఐడెంటిఫై చేయడం తో హై రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.
ఎన్డీఆర్ఐ ఆధ్వర్యంలో జీపీఆర్ స్కానింగ్ నిర్వహించి స్పాట్లను గుర్తించడంతో శనివా రం సహాయక చర్యలు పూర్తయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ అందుకుంది.
చిక్కుకున్న వాళ్లు క్షేమమేనా?
సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు క్షేమంగానే ఉన్నారా? అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇ ప్పటికే వారి బంధువులు ఇక్కడికి వచ్చారు. లోపల చిక్కుకున్న తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. కాగా చిక్కుకున్న వారి బంధువులను మీడియా కంట పడకుండా అధికారులు దాచి పెడుతున్నారు. మరోవైపు వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఏం జరుగుతుందో ఆందోళన మొదలైంది. కాగా సొరంగం పనులు చేయడానికి వచ్చిన సుమారు 200 మంది కార్మికులు ఇక్కడి నుంచి తట్టబుట్టా సర్దుకొని వెళ్లిపోయారు.
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చే అవకాశం ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆత్రుత ఇటు రెస్క్యూ సిబ్బందిలో అటు అధికారుల్లో నెలకొంది. ప్రమాదం జరిగి సరిగ్గా వారం రోజులు అవుతుంది. ఎనిమిది రోజుల తర్వాత చిక్కుకున్నవారు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఈ సొరంగ ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్మికులంతా క్షేమ ంగా బయటికి రావాలని ప్రతి ఒక్కరూ కో రుకుంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..