అచ్చంపేట, మార్చి 13 : దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురి జాడ కోసం అధికార యం త్రాంగం మానవ ప్రయత్నంతోపాటు యంత్రాల సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటన జరిగి 20 రోజులు గడిచినా మిగిలిన ఏడుగురి ఆచూకీ ల భ్యం కాలేదు.
కేంద్ర, రాష్ట్ర విభాగాలకు చెందిన 12సంస్థలు 4 షిఫ్టులుగా టన్నెల్లోకి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేరళ క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ ర్యాడర్ గుర్తించిన డీ1, డీ2 ప్రదేశాల్లో గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. ఆ ప్రదేశాల్లో దుర్వాసన వస్తుందని కానీ మృతదేహాల ఆచూకీ మాత్రం లభించలేదు. అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద ప్రదేశానికి పంపించారు. టన్నెల్ లోపల భారీగా పేరుకు పోయిన శిథిలాలు, మట్టి, బురద ను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నారు.
భారీ గా ఉబికి వస్తున్న ఊట నీటిని డీవాటరింగ్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. దక్షిణమధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కట్టర్స్, థర్మల్ కట్టర్స్ బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ ప్లాట్‌ఫాంను కత్తిరించి పరికరాలను లోకో ట్రైన్ ద్వారా బ యటికి పంపిస్తున్నారు. డీ1,డీ2 ప్రాంతాల్లో సింగరేణి, ర్యాట్ మైనర్స్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నా యి. సహాయక చర్యలను డిజాస్టర్ అండ్ మేనేజ్మెం ట్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఉన్న తాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.