అమరచింత, జూన్ 14 : తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ దివంగత సాయిచంద్ కాంస్య విగ్రహాన్ని అమరచిం త పట్టణంలో ఏర్పాటు చేసేందుకు ఆయన సతీమణి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ ఆదివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా స్థానిక జెడ్పీ పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ కళాకారులు, సా యిచంద్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చే సి ఈ నెల 29న సాయిచంద్ 3వ వర్ధంతి సందర్భంగా సాయిచంద్ జన్మించిన అమరచింతలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన కార్యచరణపై చర్చించారు.
అనంతరం రజినీసాయిచంద్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సాయిచంద్ ఏడడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్త బస్టాండ్ ఆవరణలో ఏర్పా టు చేస్తున్నామని, కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆ మె వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, ప ట్ట ణాధ్యక్షుడు నర్సింహులుగౌడ్, నాయకులు నాగభూషణంగౌ డ్, లెనిన్, సాయిచంద్ అభిమాను లు శేఖర్, రమేశ్నాయిక్ పాలొన్నారు.