పెద్దమందడి / తిమ్మాజిపేట / మక్తల్ / కొత్తకోట / అచ్చంపేట : శ్రీరామనవమి (Srirama Navami ) వేడుకలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం ఘనంగా జరిగాయి. అందంగా అలంకరించిన దేవాలయాల్లో, చలువ పందిళ్లు వేసి, సీతారాముల కల్యాణ ( Wedding ) ఉత్సవాలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య, రాములవారు, సీతమ్మ మెడలో మాంగల్య ధారణ చేశారు.
సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం వద్ద గ్రామస్థుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జగదీశ్వర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, రాజు, కురుమూర్తి, వెంకటేష్, శ్రీశైలం, గోవిందు, కుమార్, రాజశేఖర్, దశరథం, భాను , యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేటలో..
తిమ్మాజీపేట మండలంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చేగుంట, తిమ్మాజీపేట గ్రామాలలో సీతమ్మ రాముల వారి విగ్రహాలను ఊరేగించారు.ఆవంచ, అప్పాజీపల్లి, మరికల్, పోతిరెడ్డిపల్లి, గొరిట, నేరెళ్లపల్లి తదితర గ్రామాల్లో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపారు.
మక్తల్లో..
మక్తల్ మండలం సంఘం బండ ఆంజనేయ స్వామి దేవాలయంలో రాములవారి కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరై రాములవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా దేవాలయ ప్రాంగణం మొత్తం అలంకరణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
కొత్తకోట మండలంలో..
శ్రీరామ నవమి సందర్భంగా కొత్తకోట మండలంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన
సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద
సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సీతారాముల కల్యాణం ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు, వివిధ పార్టీల
నాయకులు హాజరై కల్యాణాన్ని తిలకించారు.
అచ్చంపేట పట్టణంలో..
అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబ ఆలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా
జరిగింది. ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణ నడుమ, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు హాజరై
విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, నిర్వాహకులు ఆలయ అధ్యక్షులు పోకల శ్రీధర్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు పోకల మనోహర్, టీఆర్ఎస్ నాయకులు మాజీమున్సిపల్ చైర్మన్ తులసీరామ్, కౌన్సిలర్ గౌరీ శంకర్, మను పటేల్, కమిటీ సభ్యులు దమ్ముజు సతీష్, కేత పెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.