కొత్తకోట, జనవరి 23 : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చడానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం నోటీసులు పంపిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కొత్తకోట మండల కేం ద్రంలో శుక్రవారం జరిగిన భారీ బైక్ ర్యాలీలో బుల్లేట్ నడుపుతూ ప్రతి వార్డు తిరిగి ఏటీఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి కారు రేసింగ్ పోటీలకు సంధించిన విషయంలో విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేశారని, అదే విధానాన్ని అవలంబించి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ పేరుతో విచారణకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకు లు, సిట్, పిట్లకు భయపడరని, ఉద్యమ పార్టీకి కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్త కాదని, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఎండగట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తడాకా చూపిస్తామని హెచ్చరించారు.
సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇచ్చామని, మున్సిపల్ ఎన్నికల్లో నూ అంతే కసిగా పనిచేసి దేవరకద్ర నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు కూడా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీల వైఫల్యాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మాజి ఎంపీపీ గుంత మౌనికా మల్లేశ్, మాసీ సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, జగన్మోమణ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వడ్డె శ్రీనివాసులు, గుంత మల్లేశ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ యాదగిరి, మాజీ రైతు సంఘం అధ్యక్షుడు గిన్నె కొండారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజి కోఆప్షన్ సభ్యులు, మాజీ డైరెక్టర్లు, వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్ధులు పాల్గొన్నారు.