మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 21 : తెలంగాణ ఉద్యామానికి దిక్చూచిగా నిలిచి, స్వరాష్ట్రం కోసం నిరంతరం త పించిన మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని ఎక్సై జ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రం పద్మావతీ కాలనీలోని గ్రీన్ బెల్ట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అయన విగ్రహానికి మం త్రి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి తెలంగాణ భావాజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానీయుడు జయశంకర్ అని వారి సేవలను కొనియాడారు.
లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ
తెలంగాణ రాష్ట్ర సా ధనకు తన పదవినే త్యాగం చేసిన పోరాట యోధుడు కొం డా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రం పద్మావతి కాలనీలోని గ్రీన్‌బెల్ట్‌లో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని బుధవారం మం త్రి ఆవిష్కరించారు. విగ్రాహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరి త్ర పుస్తకాన్ని అవిష్కరించి ఆయన సేవలను మంత్రి కొనియాడారు.
యోగాసనాలు వేసిన మంత్రి
పాలమూరు, జూన్ 21 : మహబూబ్‌నగర్‌లోని రాయల్ ఫంక్షన్హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అందరితో కలిసి యోగాసనాలు వేశారు.
తెలంగాణ బాపూజీ మొగ్గలు పుస్తకావిష్కరణ
తొలి, మలి తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత విశేషాలతో పాలమూరు సాహితీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రచించిన ‘తెలంగాణ బాపూజీ మొగ్గలు’ అనే కవితాసంపుటిని బుధవారం క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొండా లక్ష్మణ్ బా పూజీ చివరి శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన గొప్ప ఉద్యమకారుడని కొనియాడారు. అనంత రం డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు శాం తన్నయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ జిల్లా చైర్మన్ రాజేశ్వర్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, పతాంజలి యోగా సమితి అధ్యక్షు డు వెంకట్రాములు, గంగాధర్, మనోహర్‌రెడ్డి, రాంరెడ్డి, సాయిలుయాదవ్, మద్ది యాదిరెడ్డి, సుభాష్‌రెడ్డి, విజయ్‌కుమార్, డీసీసీబీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్ రవికిషన్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు శివరాజ్, లక్ష్మణ్, తెలంగాణ ప్రాంత పద్మాశాలీ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, బాలరా జు, శ్రీనివాస్, తిరుమల వెంకటేశ్, దాసు, వెంకటేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాలుగు నెలల్లో టెంట్ సిటీ ప్రారంభం
మహబూబ్నగర్మెట్టుగడ్డ, జూన్ 21 : జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ పార్కులో రాబోయే నాలుగు నెలల్లో ప్రసిద్ధ వారణాసి టెంట్ సిటీ తరహాలో ఇక్కడ కూడా అద్భుతంగా టెంట్ సిటీని ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వారణాసిలో ఉన్న ప్రఖ్యాత టెంట్ సిటీ నిర్వాహకులు లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి బుధవారం ఎకో పార్కులో టెంట్ సిటీ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. మొదటి దశలో 20 లగ్జరీ టెంట్ హౌస్‌లతోపాటు రెస్టారెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. రెండో దశలో ఉడెన్ కాటేజెస్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక ఓఎస్డీ సత్యనారాయణ, లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ ఎకో పార్కులో పర్యటించారు.