గడువులోగా ఎస్ఐఆర్ ఫామ్స్ అందజేయాలి
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపి సంబంధిత బీఎల్వో లేదా బీఎల్ఏలకు అందజేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని సోలీపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటరు మ్యాపింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్‌లో ఓటరు మ్యాపింగ్ పరిశీలన
ఖిల్లాఘణపురం, జూలై 14 : ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపి సంబంధిత బీఎల్వో లేదా బీఎల్ఏలకు అందజేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని సోలీపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటరు మ్యాపింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఫామ్స్ గడువులోగా అందజేయాలని, ఇప్పటి వరకు ఫామ్స్ నింపని అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉంటే వారు కూడా వెంటనే ఫామ్స్ సమర్పించాలని కోరారు.
గ్రామంలోని బీఎల్వోలు , బీఎల్ఏలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో ప్రతి ఓటరుకు అవగాహన కల్పించి, ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. అనంతరం ఎస్ఐఆర్ కార్యక్రమం ఉద్దేశం, ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారమ్‌ల ప్రాముఖ్యత గురించి అందరికీ వివరించారు. రెవెన్యూ అధికారులు ఎస్ఐఆర్ గణన త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి అర్హత కుటుంబం ఎస్ఐఆర్ గణనలో భాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి అవగాహన కల్పించారు.
ప్రతి అర్హత కుటుంబం ఎస్ఐఆర్ గణనలో తప్పనిసరిగా భాగస్వాములు కావాలని, సరైన వివరాలతో గణన ఫారాలను పూర్తి చేసి సం బంధిత అధికారులకు సమర్పించాలని ప్రజలకు సూ చించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ బాలీశ్వర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి పురేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామ్యానాయక్, సర్పంచ్ బాలరాజు, మాజీ సర్పంచులు పీనానాయక్, కృష్ణయ్యగౌడ్, గిరమ్మ, వెంకటయ్య, బుచ్చిబాబుగౌడ్, ఆంజనేయులుగౌడ్, పొలిశెట్టి ప్రతాప్, చెరుకు గోపా ల్, కరీంపాషా, మహేందర్, కురుమయ్య, పార్టీ నా యకులు, పెద్దమందడి మండలంలోని జంగమాయిపల్లి, బలిజపల్లి సర్పంచులు, నాయకులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

