ప్రారంభమైన సింగోటం బ్రహ్మోత్సవాలు
సింగోటంలో ఏటా మకర సంక్రాంతి తర్వాత లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు
- 18న లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం
కొల్లాపూర్ రూరల్, జనవరి 16 : సింగోటంలో ఏటా మకర సంక్రాంతి తర్వాత లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. రథోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలు భారీగా తరలిరానున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తేరును ఆలయం కమిటీ చైర్మన్ ఆదిత్యలక్ష్మారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ద్ధన్రెడ్డి ప్రారంభించనున్నారు. భక్తులు శ్రీవారి సముద్రంలో పర్యటించేందుకు మరబోటులను ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీని కూడా అందుబాటులో ఉంచారు. భక్తులు సింగోటం చేరుకునేందుకు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి డిపోలనుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

