నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 6: నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మర్రి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని నాగర్‌కర్నూల్, తెలకపల్లి, బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట మండలాల బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మర్రికి గజమాల వేసి కేక్‌కట్ చేయించారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన పలువురు ముస్లిం, మైనార్టీ నాయకులు మర్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్నిమండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.