గోపాల్పేట, జనవరి 27 : సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని ఏదుట్లలో చోటుచేసుకున్నది. కాగా, విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరా లు ఇలా ఉన్నాయి. మండలంలోని ఏదుట్లకు చెందిన వెంకటస్వామి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటస్వామి హైదరాబాద్‌లోని లింగంపల్లిలో రెండేండ్ల కిందట తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. అప్పటి నుంచి అరుణ కూలీ పనులు చేసుకొని పిల్లలను పోషిస్తుంది.
పెద్ద కుమారుడు భరత్(13) గోపాల్పేట ఎస్సీ బాలుర హాస్టల్లో ఉం టూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉద యం హాస్టల్లో భరత్ కాలకృత్యాలు తీ ర్చుకొని, స్నానం చేసి స్టడీ అవర్‌లో విద్యార్థులతో కలిసి చదువుకుంటున్నాడు. అకస్మాత్తుగా కిందపడిపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృ తిచెందినట్లు నిర్ధారించారు. కొడుకు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
విషయం తెలుసుకున్న వి ద్యార్థి సంఘాల నాయకులు దవాఖాన వద్దకు చేరుకొని మృతదేహాన్ని ప్రధాన రహదారిపై ఉంచి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేశారు. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ.. మృ తుడి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులపై ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడంతో వ రుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయ ని మండిపడ్డారు. ఘటనా స్థలానికి ఆర్డీ వో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు చేరుకొని విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తల్లి అరుణ ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విద్యార్థి మృతి విషయం తెలుసుకొని బాధిత కుటంబాన్ని పరామర్శించారు. ప్ర భుత్వం న్యాయం చేయాలని కోరారు.