వనపర్తి టౌన్, మార్చి 8 : సమాజంలో మహిళల పాత్రం ఎంతో గొ ప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సింగిరెడ్డి వాసంతి దంపతులు హాజరయ్యారు. ముందుగా మహిళలతో కలిసి సింగిరెడ్డి వా సంతి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిదంగా మాజీ మంత్రి మహిళా వయోవృద్ధులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ మహిళా ప్రదినిధులను సింగిరెడ్ది వాసంతి సన్మానించారు. మహిళలకు ఏర్పాటు చేసిన భోజనాన్ని నిరంజన్‌రెడ్డి స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలన్నారు. మహిళలు నిరంతర శ్రమజీవులని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు. అవకాశా లు వస్తే అద్భుతాలు సృష్టించగలరని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. అదేవిధంగా సింగిరెడ్డి వాసంతి మాట్లాడుతూ కేసీఆర్ సర్కారులో మహిళలకు కల్యాణలక్ష్మి, వడ్డీలేని రుణాలు, కేసీఆర్ కిట్టు, ప్రసూతి దవాఖానలు ఏర్పాటు చేసి మహిళల అభ్యున్నతికి తోడ్పాటునందించారన్నారు.
నా ఎదుగుదలలో తన భర్త నిరంజన్‌రెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. అనంతరం పలువురు మహిళలు మాట్లాడుతూ నిరంజన్‌రెడ్డి ఓ డిపోవడం దురదృష్టకరమని, ఆయన ఓటమితో నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రైతుబంధు, రుణమాఫీ, పింఛన్లు ఆగిపోయి అవస్థలు పడుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు సంధ్య, అలేఖ్య, భారతి, బీఆర్ఎస్ నేతలు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, అశోక్, రాములు, కృష్ణయ్య, కృష్ణానాయక్, రఘుపతిరెడ్డి, మాణిక్యం, దిలీప్‌రెడ్డి, జగన్నాథంనాయుడు, పరంజ్యోతి, రాము, గులాం ఖాదర్‌ఖాన్, జోహెబ్ హుస్సేన్ పాల్గొన్నారు.