వనపర్తి టౌన్, మే 13 : ఆయిల్‌పాం తోటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మం గళవారం వనపర్తి మండలంలోని అచ్యుతాపురంలో రైతు బోయిని వాసు 4ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పాం తో టను మాజీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ భవిష్యత్ తరాల ప్రయోజనాల కో సం తన హయాంలో ఆయిల్‌పాం తోటలపై రైతులకు అవగాహన కల్పించి సాగు దిశగా ప్రోత్సహించినట్లు గుర్తుచేశారు.
ఆయిల్‌పాం తోటల వల్ల రైతులు దీర్ఘకాల ఆ దాయం పొందవచ్చని, అదేవిధంగా అంతర్గత పంటలు వేసుకొని జీవనోపాధి పొందవచ్చన్నారు. మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వల్ల భూసారం పెరగడంతోపాటు అ ధిక దిగుబడిని సాధించే వీలుంటుందని వివరించారు. అ నంతరం ఆయిల్‌పాం సాగు చేసిన రైతులను అభినందించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శారద, ఆశన్ననాయుడు, నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.