వనపర్తి టౌన్, జూన్ 7 : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ స్వీకర్త, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం, జ్ఞాపకా లు, అనువాదాలతో ఒకరోజు సాహితీ సమ్మేళనాన్ని హైదరాబాద్‌లోని దర్బార్ హాల్, వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు.
వి శ్వంభర, పంజాబీ, మలయాళం అనువాదాలు, ప్రపంచపదులు తమిళ అనువాదాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ నలుమూల పరిచయం చేసిన మహాకవి సీ నారాయణరెడ్డి అని తెలుగు చిత్రసీమలో ఎన్నో సినీ గేయాలు రచించి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని అన్నారు. ఆయనతో పాటు పలువురు పెద్దలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.