జోగులాంబ గద్వాల : గద్వాల( Gadwal ) పట్టణం కిష్టారెడ్డి బంగ్లా వద్ద పట్టు చీరల దొంగల ( Silk Saree Thieves) కలకలం రేపింది. ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉండే కిష్టారెడ్డి బంగ్లా ప్రాంతంలోని ఓ పట్టు చీరల దుకాణంలోకి సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి కస్టమర్ల మాదిరిగా నటించారు.
సిబ్బంది కళ్లుగప్పి విలువైన పట్టు చీరలను అపహరించిన అనంతరం, వారు ముందుగానే సిద్ధం చేసుకున్న ఒక ఆటోలో అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. గమనించిన స్థానిక వ్యాపారులు, ప్రజలు వెంటనే అప్రమత్తమై సదరు ఆటోను వెంబడించారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత ఆటోను అడ్డగించిన స్థానికులు అందులో ఉన్న ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలను పట్టణ ఎస్సై-2 జహంగీర్ వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.