మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 24 : విధులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని మహబూబ్నగర్ కలెక్టర్ కుష్బూగుప్తా హెచ్చరించారు. గండీడ్ మండలంలో నిర్వహిస్తున్న మహ్మదాబాద్ కేజీబీవీని బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఉపాధ్యాయులు సైతం వరండాలో ఉండటంతో ఆగ్రహం చెందారు. ఎస్వో శివలీల ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించిన కలెక్టర్ చర్యలకు ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎస్వోకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.