జడ్చర్ల టౌన్, అక్టో బర్ 29 : జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జడ్చర్ల అసెంబ్లీ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగ పడ్డ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆదివార0 హైదరాబాద్లో ని ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మూడు పర్యాయాలు జడ్చర్ల ఎమ్మెల్యేగా పని చే సిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేర డంతో బీఆర్ఎస్ పార్టీకి మరింతబలం చేకూరనుంది.