అచ్చంపేట, మార్చి 4 : నల్లమలలో శివ మాలధారుల రద్దీ పెరిగింది. శ్రీశైల మల్లన్న దర్శనానికి ఇరుముడులతో స్వాములు కాలినడకన వెళ్తుండడంతో అటవీ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా శ్రీగిరికి చేరుకుంటున్నారు. వీరి సౌకర్యార్థం దారి పొడవునా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కేంద్రాలు, చలివేంద్రాలు, పండ్లు, మజ్జిగ పంపిణీతోపాటు విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎండలు ముదరడంతో ఉదయం, సా యంత్రం స్వాములు నడక సాగించి మధ్యాహ్నం విశ్రాంతి తీసు కుంటున్నారు.
శ్రీశైలానికి కాలినడక న వెళ్తున్న భక్తులు, శివమాలధారులకు అధికార యంత్రాంగం సౌకర్యా లు కల్పించడంలో విఫలమమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దారిపొడవునా చలివేంద్రాలు, వైద్యశిబిరాలు, పాతాళగంగ వద్ద స్నానమాచరించే భక్తుల కోసం తా త్కాలిక మూత్రశాలలు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, సేద తీరేందుకు విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సంబంధిత శాఖల అధికారులు సమావేశమై ఏర్పాట్లపై చర్చించాలి. మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు, చలివేంద్రాలు, విశ్రాంతి కేం ద్రాలు ఏర్పాటు చేయాలి. శివరాత్రికి మూడు రోజుల సమయమే ఉండగా నేటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, శివస్వాములు, భక్తులకు స్వ చ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి.
మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు అటవీ మార్గంలో కాలినడకన వెళ్తున్న శివస్వాములకు కార్చిచ్చు, ప్లాస్టిక్ నివారణ కోసం అవగాహన కల్పించేందుకు మూడు పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. దారిపొడవునా పెట్రోలింగ్ నిర్వహిస్తూ మంటలు పెట్టి వంటలు చేయకుండా, ప్లాస్టిక్ కవర్లు ఉ పయోగించకుండా అవగాహన కల్పిస్తున్నా రు. అటవీశాఖ ఆధ్వర్యంలో మూడు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మన్ననూర్ ఎఫ్ఆర్వో ఈశ్వర్ తెలిపారు. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా వేల హెక్టార్లలో అడవి దగ్ధమైన కారణంగా అడవిలో పొయ్యి పెట్టి వం ట చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.