అలంపూర్, జూన్ 1 : వందల ఏండ్లుగా హిందూ ముస్లింలు ఐకమత్యంతో మత సామరస్యానికి ప్రతీక గా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉత్సవాలకు ఎమ్మెల్యేతోపాటు హజ్ యాత్ర కమిటీ చైర్మన్ కుద్రుబాషా బియామానీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అలంపూర్లో షా అలీ పహిల్వాన్ ఉర్సులో భాగంగా మూడో రోజైన శనివారం ఆలయాల సముదాయంలోని పెద్ద దర్గా వద్ద భక్తి శ్రద్దలతో పెద్ద కిస్తీ నిర్వహించారు. ఉర్సు నిర్వాహకులు సయ్యద్ సలీమొద్దీన్ అమ్మద్ ఖాద్రీ, ఓవైస్ అమ్మద్ షాద్రీ, ఖాదర్వలీ ఇంటి నుంచి సర్కార్ కిస్తీ పెద్దదర్గా చేరుకున్న తర్వాత పట్టణంలో భక్తులు, డ్రైవ ర్ యూనియన్లు, కులసంఘాల నాయకులు ఎద్దుల బండ్లు, ఆటోలు, ఇతర వాహనాలపై ప్రసాదాన్ని ఊరేగింపుగా మేళతాళాలు, డప్పుల మధ్య తీసుకొచ్చి కిస్తీ లో సమర్పించారు. చుట్టుపకల గ్రామాల ప్రజలు కూ డా ప్రసాదాలను తీసుకొచ్చారు. కాగా, పంపిణీకి సి ద్ధంగా ఉంచిన ప్రసాదం వద్ద (రాతిపడవ) మత పె ద్దలు, ఉర్సు నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కిస్తీ నుంచి పహిల్వాన్లు విసిరేసే ప్రసాదాన్ని చేజిక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఉత్సవాలను తిలకించేందుకు స్థానికులేకాకుండా పక్క జిల్లాలు, రాష్టాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. పహిల్వాన్ విన్యాసా లు, బల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉర్సు సందర్భంగా పరిసర ప్రాంతాల్లో చిరు దుకాణాలు, ఆట వ స్తువులు, రంగురాట్నాలు వెలిశాయి. కార్యక్రమంలో ఉర్సు కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు, వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ఫకీర్లు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అలంపూర్ సీఐ రవిబాబు ఐదుగురు ఎస్సైలు, 100 మంది పోలీసులతో కలిసి బందోబస్తులో పాల్గొన్నారు.
ఉర్సును పురస్కరించుకొని పట్టణంలో దట్టీల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలో పటాన్ వీధి, అక్బర్పేట నుంచి తెల్లవారుజామున బయలుదేరిన దట్టీలు పురవీధుల్లో పహిల్వాన్ల బలప్రదర్శనలతో ఉభయ ద ర్గాల్లో ప్రార్థనల తర్వాత యథాస్థానానికి చేరుకున్నాయి.