అర్ధరాత్రి హల్చల్.. కొత్తపల్లిలో ఇసుక డంపుల కోసం రంగంలోకి షాడో ఎమ్మెల్యే
ఇసుక డంపుల కోసం అర్ధరాత్రి ఓ షాడో ఎమ్మెల్యే మంది మార్భలాన్ని వెంటేసుకొ ని రావడం సంచలనం కలిగిస్తున్నది.
- రూ.కోట్ల విలువైన డంపులపై అధికార పార్టీ నాయకుల కన్ను
- పోలీసులను అడ్డుపెట్టుకొని రాత్రికి రాత్రి దూకుడు
- డోజర్, హిటాచీని సీజ్ చేయించిన వైనం
- సంచలనంగా ఎమ్మెల్యే సోదరుడి వ్యవహారం
- ఇసుక ఎత్తుకెళ్తారని మా భూముల్లోనే చదును చేశామన్న భూ యజమానులు
మహబూబ్‌నగర్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇసుక డంపుల కోసం అర్ధరాత్రి ఓ షాడో ఎమ్మెల్యే మంది మార్భలాన్ని వెంటేసుకొ ని రావడం సంచలనం కలిగిస్తున్నది. ఈ డంపులపై కన్నేసిన అధికార పార్టీ నేతలకు దక్కకుండా భూ యజమానులు ఇసుకను చదును చేస్తుంటే వచ్చి అడ్డుకొని ఓ డోజర్, హిటాచీలను సీజ్ చేయించారు. షాడో ఎమ్మెల్యే ఇసుక డంపులకు చేరుకోగానే పోలీస్ యంత్రాంగం హుటాహుటినా అక్కడికి చేరుకున్నది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో ఇసుకను చదును చేయకుండా అడ్డుకొని వెనక్కి పంపించారు. అయితే ఇదంతా అక్రమార్కులు ఇసుక తరలిస్తుంటే అడ్డుకున్నామం టూ సదరు పార్టీ నేతలే అంటుండడం గమనా ర్హం. జడ్చర్ల ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఆయన సోదరుడు రంగంలో దిగి తమపై అక్రమంగా కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామం సమీపంలో ఉన్న భారీ ఇసుక డంపు విలువ రూ.కోట్లల్లో ఉన్నది. గతంలో అక్రమంగా ఈ క్వారీ నుంచి పెద్ద ఎత్తున తరలించి సొమ్ము చేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వందలాది టిప్పర్ల ఇసుకను అనుమతుల గడువు ము గిసిన కారణంగా వదిలిపెట్టారు. అయితే నా టకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఇసుక డం పులను అధికార పార్టీ నేతలే సీజ్ చేయించా రు. ఇదిలా ఉండగా ఇటీవల సీఎం ఇదే మండలం లో పర్యటించడం.. దీనికి పెద్ద ఎత్తున ఖర్చు పె ట్టినామంటూ కొందరు అధికార పార్టీ నేతలు దీ నిపై కన్నేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారని తె లియడంతో భూ యజమానులు డంపులు చదును చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారం సోమవారం అధికార పార్టీ నేతలకు, యజమానులకు మధ్య అగ్గి రాజు కోవడంతో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది.
తీన్మార్ మల్లన్న సోదరులకు అప్పగించారని..
కొత్తపల్లి గ్రామంలో జహీరుద్దీన్, రాంరెడ్డి పేరు పై 90 ఎకరాల భూమి దుందుభీ వాగు పక్కనే ఉన్నది. వాగులో నుంచి ఇసుక కొట్టాలంటే ఇద్ద రి పొలం నుంచే వాహనాలు వెళ్లాలి. అయితే ప్రై వేట్ పట్టా భూముల్లో ఇసుక తోడేందుకు తెలంగాణ మినరల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకున్నారు. అనుమతులు తీసుకున్నది పట్టా భూమిలో అయితే దుందుభీ వాగునే లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున ఇసుకను తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో అధికార పార్టీ నేతలతోపాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోదరులు కూడా రంగప్రవేశం చేసి ఇసుక రవాణాకు తెరలేపారు. అయితే ఎమ్మెల్యే అనుచరులు రం గంలోకి దిగడంతో మల్లన్న సోదరులను పంపించేశారు. భారీ ఎత్తున ఇసుకను తరలిస్తుండడం తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకోవడం తో కొన్ని రోజులు ఇసుక రవాణా నిలిచిపోయిం ది. చివరకు డిసెంబర్ నెలలో అనుమతుల గడు వు ముగియడంతో.. వాగు నుంచి తోడిన ఇసుకను పక్కనే ఉన్న పట్టా భూమిలో నిల్వ చేశారు. ఈ నిల్వ చేసిన ఇసుకను తరలిస్తారని అనుమానంతో భూ యజమాను లు చదును చేయడంతోనే అసలు ట్విస్ట్ మొదలైంది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో..
జడ్చర్ల నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఈ ఇసుకను తరలించి అక్కడ నిల్వ చేయాలని అధికార పార్టీ నేతలు భావించారు. మళ్లీ అనుమతులు అంటూ వెళితే ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో రూ. కోట్లు విలువచేసే ఈ ఇసుక నిల్వలపై కన్ను పడింది. ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతలు అక్రమంగా ఇసు క తరలిస్తారని భావించిన భూ యజమానులు రెండు, మూడ్రోజులుగా ఇసు క డంపులు కనబడకుండా అదే భూమి లో చదును చేస్తున్నారు. దీంతో విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు సోమవారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లి హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మా రింది. తాము తరలించాలనుకున్న ఇసుకను దక్కకుండా భూ యజమానులు చదును చేస్తుండడంతో ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు అక్కడే ఉన్న ఒక హిటాచీ, డోజర్లపై కేసు నమో దు చేయించి సీజ్ చేయించారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహా రం కాస్తా రాజకీయ దు మారం లేపుతోంది.
రంగంలోకి ఎమ్మెల్యే సోదరుడు
మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని దుందుభీ వాగు నుంచి భారీ ఎత్తున ఇసుకను వాగు పరీవాహక ప్రాంతంలో డంపు చేశారు. గతేడాది దుందుభీ వాగు నుంచి ఇసుక తరలింపు కోసం అధికార పార్టీ నేతల అండతో భూ యజమానులు టీఎస్ఎం డీసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. దీంతో అనుమతులకు మించి ఇసుకను తరలించడం మొదలుపెట్టారు. మధ్యలో గ్రామస్తులు అడ్డుకోవడంతో కొన్ని రోజులపాటు ఇసుక రవాణా నిలిచిపోయింది. చివరకు మళ్లీ కొనసాగడంతో భారీ ఎత్తున వాగు నుంచి ఇసుకను తోడేసి పథకం ప్రకారం పక్కనే పెద్ద ఎత్తున నిల్వ చేశారు. ఈ నిల్వ చేసిన ఇసుకను అధికార పార్టీ నేతలే సీజ్ చేయించారు. ప్రస్తుతం తరలించేందుకు ప్రయత్నించడంతో వివాదం నెలకొన్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

