అయిజ, ఆగస్టు 12 : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ప్రభుత్వం అందజేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు గొప్ప వరమని అలంపూర్ ఎ మ్మెల్యే విజయుడు అన్నారు. సోమవా రం పట్టణంలోని తాసీల్దార్ కార్యాల య ఆవరణలో అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చి వారిని ఆదుకున్నదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హులకు వెనువెంటనే చెక్కులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దేవ న్న, వైస్ చైర్మన్ నర్సింహులు, తాసీల్దార్ జ్యోతి, ఆర్ఐ మద్దిలేటి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.