కొల్లాపూర్, జూలై 5 : గ్రామీణ ప్రాంతాల్లో కరువు కాలంలో వలసల ను నివారించి, లక్షలాది నిరుపేద కుటుంబా లకు ఆర్థిక భరోసానిచ్చిన మహాత్మాగాంధీ జా తీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీరామ్‌జీ చట్టం జూలై నుంచి అమల్లోకి వచ్చింది. 125 రోజుల పనిదినాలంటూ కేంద్రం ఆర్భాటంగా ప్రకటి స్తున్నపటికీ, ఈ నూతన చట్టం వల్ల తెలంగాణ లోని ఉపాధి కూలీలకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడనున్నది. ఈ చట్టాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలన్న
డిమాండ్ గట్టిగా వినబడుతోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో వ్యవసాయ పనులు లేని ఎండకాలంలో ఉపాధి హామీ పనులే ప్రధాన ఆధారం. అయితే కొత్త చ ట్టంలోని 60 రోజుల అగ్రికల్చర్ లాకౌట్ ని బంధనల వల్ల, స్థానికంగా పనులు దొరకక గ్రామీణ పేదలు మళ్లీ ముంబై, హైదరా బాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఒక నాగర్ కర్నూల్ జిల్లాలోనే 461 గ్రామాల్లో 1,68,897 జాబ్ కార్డులు ఉన్నాయి. లాకౌ ట్ నిబంధనతో జాబ్ కార్డులలోని 90 శాతం మంది కూలీలకు స్థానికంగా పని దొరికే అవకాశం
లేకుండా పోతుంది.
గ్రామ సభలలో కూలీలు తమకు కావాల్సిన లేదా గ్రామ అవ సరాల నిమిత్తం చెరువుల పూడికతీత, కల్వర్టులు, వైకుంఠ ధా మాల పనులు తామే నిర్ణయించుకునేవారు. కానీ కొత్త చట్టం ప్రకారం పనులన్నీ కేంద్రం నిర్దేశించిన 4 థీమాటిక్ వర్టికల్స్ ఆధారంగా జరగాల్సి ఉంటుంది. చెరువుల పూడికతీతతో, కాల్వలలో జమ్ము తొలగించడంతో రైతులకు మేలు జరిగేది. కానీ ఇప్పుడు నూతన చట్టంతో స్థానిక అవసరాలకు ప్రా ధాన్యం తగ్గుతుంది. దీంతో ఉపాధి కూలీలకు అనుమైన పను లు లభించేందుకు అవకాశం ఉండదు. అంతేకాదు గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉంటుందని సర్పం చులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి కూలీలలో ఎక్కువ శాతం అక్షరాస్యులు కారు. ఇప్పు డు కొత్తగా గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డు కోసం ఈ-కేవైసీ తప్పనిసరి చేయ డంతో సర్వర్ల సమస్యలు, వేలిముద్రలు పడక పోవ డం వల్ల వేలాది మంది పేదలు పనులకు దూర మయ్యే ప్రమాదం ఉన్నది. కూలీలు నిత్యం పనిచే స్తుండడంతో వారి వేలిముద్రలు చేదిరిపోయి ఉం టాయి. ఇప్పటికే పింఛన్ తీసుకునేందుకు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఉపాధి పథకానికి కూడా ఈ-కేవైసీ తీసుకరావడంతో ఉపాధి పనులకు వెళ్లే కూలీల సంఖ్య కూడా క్రమేణా తగ్గే అవకాశం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం ఏటా సగటున రూ.3వేల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఉపాధి హామీ నిధులను వినియోగిస్తూ, దేశంలోనే అగ్రగామిగా ఉంది. నూతన చట్టంలో 40శాతం నిధుల వాటా భారం రాష్ట్ర ఖజానాలపై వేల కోట్ల భారం పడనున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ఉపాధి కూలీలకు వందశాతం కేంద్రమే వేతనాలను ఇచ్చేది. నూతన చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను భరిం చాల్సి వస్తుంది. కేంద్రం ప్రతి రాష్ర్టానికి నిర్దిష్ట బడ్జెట్ పరిమి తిని విధిస్తుంది. ఒక వేళ రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చి కేంద్రం విధించిన పరిమితికి మించి కూలీలు పనులు చేస్తే అదనంగా వందశాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
లేదంటే కూలీలకు పనులు బంద్ పెట్టాలి. బీఆర్ఎస్ హయాంలో ఉపాధి నిధు లతో నిర్మించిన రైతు వేదికలు, వై కుంఠ ధామాలు ఇప్పుడు ఎం తో ఉపయోగంలో ఉన్నాయి. తెలంగాణ పల్లెల ప్రగతికి, దళి త, గిరిజన వెనుకబడిన వర్గాల జీవనోపాధికి వెన్నుముకగా ని లిచిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నామరూపల్లే కుండా చేసేందుకు కేంద్రం ఈ వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తెచ్చి నట్లు కనిపిస్తోంది. 125 రో జుల పని అనేది కేవలం ఒక భ్రమ. తక్షణమే ఈ కొత్త చట్టా న్ని రద్దు చేసి పాత నిధుల విధానంతో కూడిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని వ్యవసా య కార్మిక సంఘాలతో పా టు, ప్రజా సంఘాల నాయ కులు డిమాండ్
చేస్తున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన వీబీజీరామ్‌జీ చట్టంతో రైతు, కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అంతేకాదు రాష్ర్టాల హక్కుల హరించి పెత్తనం చేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అర్థం అవుతోంది. ఈ చట్టంతో మరింత వలసలు పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామాల అవసరాలకు ప్రాధాన్యం ఉండదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్నే అమలులోకి తీసుకురావాలి.
– వెంకట్రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి