Delhi : విద్యార్థులపై లాఠీఛార్జ్‌కి నిరసనగా ప్రధాని నివాసం ముందు బైఠాయించి అరెస్టైన కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విడుదలయ్యారు. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని నరేంద్ర మోడీ నివాసం బయట ధర్నాకు దిగిన రాహుల్‌ను ఛత్రసాల్ స్టేడియం తరలించిన పోలీసులు.. కొన్ని గంటల తర్వాత పంపించేశారు.
ప్రధాని నివాసం ముందు మెరుపు ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను ఛత్రసాల్ స్టేడియం తీసుకెళ్లారు. అలానే.. ధర్నా సందర్భంగా అరెస్టైన ఎంపీ ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
#WATCH | Delhi: LoP Lok Sabha & Congress MP Rahul Gandhi leaves from Chhatrasal Stadium.
Some of the opposition leaders, who were protesting at Lok Kalyan Marg and detained by Delhi Police, were brought to Chhatrasal Stadiuma short while ago. pic.twitter.com/1phdnpjK54
— ANI (@ANI) July 21, 2026
దాంతో, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్టేషన్‌కు వెళ్లి ప్రియాంకను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రధాని నివాసం ముందు నుంచి బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. దాదాపు నాలుగైదు గంటల తర్వాత వీరిని విడిచిపెట్టారు. అలానే సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు ఛలో పార్లమెంట్లో పాల్గొని అరెస్టైన 70 మంది నిరసనకారులకు కూడా విముక్తి లభించింది.
#WATCH | Delhi | Congress MP Priyanka Gandhi Vadra says, “… If the Leader of the Opposition wishes to speak in Parliament, he is not allowed to do so. If we seek permission to stage a protest, that permission is denied. So we went to a place where they least expected us.” pic.twitter.com/rLF8uXfmfe
— ANI (@ANI) July 21, 2026