న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను సఫ్దర్ జంగ్ దవాఖాన నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానకు మంగళవారం తరలించారు. తన భర్త వాంగ్చుక్కు ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించేందుకు అనుమతి కోరుతూ అతని భార్య గీతాంజలి అంగ్మో దాఖలు చేసిన అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.