బీడ్: నీట్ యూజీ-2026 ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసాలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సోనమ్ గవ్టే అధికారిక ఆన్సర్ కీతో తన ఓఎంఆర్ జవాబు పత్రాన్ని పోల్చి చూసినప్పుడు తనకు 522 మార్కులు రావాల్సి ఉందన్నాడు. అయితే ఎన్టీఏ విడుదల చేసిన స్కోర్ కార్డులో తనకు కేవలం 95 మార్కులు మాత్రమే వచ్చినట్లు చూపించారని గవ్టే ఆరోపిస్తున్నాడు. దీంతో బాంబే హైకోర్టు ధర్మాసనం ముందు రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.