మిడ్జిల్, జూలై 10 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలలు హంగులు ఆర్భాటాలతో విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకునేందుకు పోటీపడుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులు లేక చాలా మంది సర్కారు బడికి వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో మండలంలోని బైరంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు 60మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. దీంతో ఒకే తరగతి గదిలో 2,3,4 తరగతులు బోధించే పరిస్థితి నెలకొన్నది. ఉపాధ్యాయులు లేకపోవడంతలో బడికి పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. ఈ విషయమై హెచ్ఎం వినోద్‌కుమార్‌ను అడుగగా, బదిలీపై ముగ్గురు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉందని తెలిపారు.