మహబూబ్‌నగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి): పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదుగుతున్న పాలమూరు జి ల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కలగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపం లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుత కాంగ్రె స్ ప్రభుత్వం మాత్రం పాలమూరుకు మొండిచేయి చూపించి వరంగల్ జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊ పింది. దీంతోపాటు మరో మూడు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మూర్తి నాయుడుకు ఇటీవల మంత్రులు వినతిపత్రం అందజేశారు. ఇందులో పాలమూరు జిల్లా పేరు లేకపోవడంతో జిల్లా ప్రజలు విమర్శలు చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ విమానాశ్రయం ఊసే లేకపోవడంతో జనం పెదవి విరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాపై మమకారం లేదని అభివృద్ధి చేయాలన్న తపన లేదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు ఎయిర్‌పోర్టు ఇక కలేనా అంటూ వివిధ సంఘాలు అంటున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో చేపట్టడం.. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో మహబూబ్‌నగర్ జిల్లా రూపురేఖలు మారుతాయని ధీమాతో ఉన్నారు. కానీ అందుకు విరుద్ధంగా సీఎం సొంత జిల్లాకే ఎయిర్‌పోర్టు మంజూరు కాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత జిల్లాలో కాదని ఎక్కడో ఉన్న జిల్లాలో ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికలు పంపడంతో ఉమ్మడి జిల్లా వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు జరిగితే ఆ ర్థికంగా, పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం లే కపోలేదు. ఇటీవల కేంద్రం మంజూరు చేసిన విమానాశ్రయా ల్లో పాలమూరు జిల్లా పేరు లేకపోవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురువుతున్నారు. తమ ప్రాంతానికి చెందిన సీఎం ఉన్నప్పటికీ విమానాశ్రయం రాకపోవడం.. కనీసం కాంగ్రెస్ సర్కార్ కొత్త ప్రతిపాదనలు పంపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఉడాన్ స్కీం కింద టూ టైర్ పట్టణాల్లో..
కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీం కింద రాష్ర్టాల్లో అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో విమానాశ్రయాలు ఏర్పా టు చేసేందుకు ఆయా రాష్ర్టాలకు ప్రతిపాదనలు పంపాలని కోరింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు 6 పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేశారు. రాజధానికి సమీపంలో ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీని తట్టుకునే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందని భావించారు. శంషాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసిన స్థలాలకు కేవలం గంటలోపే చేరుకునే విధంగా వీటిని పరిశీలించారు. అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా దగ్గరవుతుందని ఉద్దేశంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. అన్నింటిని సమీకరించి కేంద్రానికి నివేదించారు. ఈ లోపు ఎన్నికలు రావడంతో విమానాశ్రయాలు ఏర్పాటు అటకెక్కింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న విమానాశ్రయాలపై చిన్నచూపు ప్రదర్శిస్తుంది.
రేవంత్‌కు ప్రేమ లేదు..
భూటకపు హామీలు ఇచ్చి అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేకపోతున్నది. ఇచ్చి న ఆరు గ్యారెంటీలు కూడా తుంగలోకి తొ క్కారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా అయితే ఎంతో బాగుపడుతుందని సంతోషిస్తే.. ఏడాది తిరగకముందే అ సలు స్వరూపం బయటపడింది. సొంత జిల్లాపై రేవంత్‌రెడ్డికి మమకారం లేదు.. కేవలం ప్రజలను మభ్యపెట్టి అధికారంలో కి వచ్చి అనుభవిస్తున్నారు తప్పా అభివృద్ధి చేయాలని ధ్యాసే లేదు. దీనికి సాక్ష్యం విమానాశ్రయం ఏర్పాటు. కనీసం రెండో విడుతలోనైనా పాలమూరు జిల్లా పేరు పెడితే ప్రజలు హర్షించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తుంది అనడంలో సందేహం లేదు.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గంలో ఏవియేషన్ ఆఫీసర్ల సర్వే
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దేవరక ద్ర నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఏవియేషన్ అధికారులు సర్వే చేపట్టారు. అడ్డాకుల మండలం గుడిబండ.. దేవరక ద్ర మండలం చౌదర్పల్లి.. మూసాపేట మండలం తుంకినిపూర్ గ్రామంలో విమానాశ్రయం కోసం స్థల పరిశీలన చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో జాతీయ రహదారికి ఆ నుకొని విమానాశ్రయానికి అనుకూలంగా ఉన్న భూములను పరిశీలించారు. ఢిల్లీకి చెందిన అధికారులు అడిగిన ప్రతిదానికి జిల్లా అధికారులు దగ్గరుండి సమకూర్చారు.. 2019లో ఈ మూడు చోట్ల రెండు, మూడు సార్లు స్థలాలను పరిశీలించి విమానాశ్రయానికి అనుకూలంగా ఉందని భూసేకరణ కూడా ఇబ్బంది లేదని జిల్లా అధికారులు కూడా ఏవియేషన్ అధికారులకు నివేదికలు ఇచ్చారు. గుడిబండ ,తుంకినిపూర్ చౌదర్పల్లి గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకొని ఉంటాయి. దివిటిపల్లి వద్ద ఐటీ పార్క్ నిర్మాణం.. కొన్ని కిలోమీటర్ల దూరంలోని విమానాశ్రయ నిర్మాణం వల్ల మహబూబ్‌నగర్ జిల్లా మరింత అభివృద్ధిలోకి వ స్తుందని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది.