మహబూబ్‌నగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికారం మళ్లీ రాక్షసానందం పొందింది. సాయిరెడ్డి అంతిమయాత్రపై నిర్భంధం విధించింది. గ్రా మ సరిహద్దులను బారికేడ్లు వేసి మూయించింది. పోలీసులను అడ్డుగోడలుగా నిలిపింది. దాదాపు 14 ఏండ్లపాటు గ్రామానికి సర్పంచ్‌గా పనిచేసి 85 ఏండ్ల వయస్సులో అధికార వారసత్వం బెదిరింపులు, దాడులకు తాళలేక ఆత్మాభిమానంలో జీవించలేక తనువు చాలించి న పాంకుంట్ల సాయిరెడ్డి అంతిమ సంస్కారాలు అధికా రం విధించిన అంక్షల మధ్య సాగాయి.
సాయిరెడ్డిలో ప్రా ణం తీసేవరకు అధికారం సాగించిన దౌర్యన్యకాండ.. ఆ యనను గౌరవంగా సాగనంపే అంతిమ సంస్కార కార్యక్రమాలకు కూడా తమ వికృత రూపాన్ని చవిచూపించిం ది. అందరికీ సుపరిచితుడై, గ్రామస్తుల తలలో నాలుక లా మెలిగి, కష్టసుఖాల్లో పాలుపంచుకున్న మాజీ సర్పం చ్ సాయిరెడ్డిని కడసారి చూడాలనుకున్న గ్రామస్తులు.. అధికారం విధించిన నిర్బంధంతో ఇండ్ల నుంచి బయటకు రాలేదు. కడుపున పుట్టిన పిల్లలు, సోదరులు, బం ధువులు అంతిమయాత్రలో వెంటరాగా.. నిర్బంధానికి, అవమాన భారానికి ఇక సెలవంటూ సాయిరెడ్డి పార్థివదేహం కట్టెల్లో కాలిపోయింది.
ఈనెల 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి (85) సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల వేధింపు లు, దాడులకు తాళలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయంత్రం 5 గంటలకు కల్వకుర్తి పట్టణం రఘుపతిపేట చౌరస్తా సమీపంలో విగతజీవిగా ఉన్న సాయిరెడ్డిని కల్వకుర్తి దవాఖానకు తీసుకొచ్చారు. సాయిరెడ్డి చనిపోయాడని డాక్టర్లు చెప్పడంలో సాయిరెడ్డి భౌతికకాయాన్ని మార్చురీలో ఉంచారు.
సా యిరెడ్డి పెద్ద కొడుకు వెంకట్‌రెడ్డి తన కూతురు ఇంటికి అమెరికా వెళ్లడంతో ఆయన వచ్చే వరకు సాయిరెడ్డి భౌ తికకాయాన్ని మార్చురీ గదిలో ఉంచాలని బంధువులు నిర్ణయించారు. ఆ రోజు నుంచి సోమవారం వరకు మా ర్చురీలోని ఫ్రీజర్‌లో ఉన్నది. నాలుగు రోజులుగా దవాఖానలో పోలీసులు పహారా కాస్తూనే ఉన్నారు. సాయిరె డ్డి ఆత్మహత్యకు కారణమైన రేవంత్‌రెడ్డి సోదరులపై బీఎన్ఎస్ 108సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతోపాటు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు పలువురు డిమాండ్ చేశారు.
ఆదివారం రాత్రి సాయిరెడ్డి కుమారుడు అమెరికా నుంచి తిరిగివచ్చాడు. నేరుగా కల్వకుర్తి దవాఖానలోని మార్చురీ వద్ద తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పె ట్టుకున్నాడు. తెల్లారిన తర్వాత తండ్రి భౌతికకాయానికి పోస్టుమార్టం చేయించి అంతిమ సంస్కారం కోసం కొం డారెడ్డిపల్లికి తీసుకెళ్దామని బంధువులకు చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే సోమవారం తెల్లవారుజా మున 5 గంటల వరకే పోలీసులు తమకు వచ్చిన ఆదేశాలను పాటించసాగారు. తెల్లారిన తర్వాత వెంకట్‌రెడ్డి దవాఖానకు వచ్చే వరకే పోలీసులు పోస్టుమార్టం చేయించారు. మేం రాకముందే పోస్టుమార్టం ఎలా నిర్వహిస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వెంకట్‌రెడ్డిని సముదాయించడంతో శాంతించారు. భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో కొండారెడ్డిపల్లికి తరలించారు.
ఉదయం 5గంటల నుంచి కొండారెడ్డిపల్లి అష్టదిగ్బంధనం చేశారు. పెద్దసారు ఆదేశాలతో పోలీసులు గ్రామ సరిహద్దులను బారికేడ్లతో మూసివేశారు. గ్రామంలోకి వచ్చే అన్నిదారుల వద్ద పోలీసు బందోబస్తు ఉంచారు. గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిముందు నుంచి ఎవ్వ రూ వెళ్లకుండా బారికేడ్లు వేసి బ్లాక్ చేసి పోలీసులు పహా రా కాస్తున్నారు. రాజకీయ నాయకులు, మీడియా, కొత్త వ్యక్తులు వెళ్లకుండా అంక్షలు విధించారు. సాయిరెడ్డి బం ధువులమని చెబితే.. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఊర్లోకి పంపించారు. అనుమానం వస్తే వెనక్కి పంపించారు. బంధువులను కూడా రేవంత్‌రెడ్డి ఇంటిముందు నుంచి వెళ్లే దారినుంచి కాకుండా తుమ్మలపల్లి నుంచి పంపించారు. దీంతో సాయిరెడ్డిని కడసారి చూసేందుకు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తమ గ్రామానికి ఏండ్లుగా సర్పంచ్‌గా సేవలందించి, తమ కష్టసుఖాల్లో పాలు పంచుకున్న సాయిరెడ్డిని అంతిమంగా చూసుకుందామని బలంగా ఉన్నా.. అధికారం పెట్టిన భయానికి ఇండ్ల నుంచి కదల్లేకపోయారు. సాయిరెడ్డి ఇంటి వద్దకు వెళ్తే ఏం నింద మోపుతారో ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తారోనన్న భయం గ్రామస్తుల కం డ్లల్లో కనిపించింది. ఒకరిద్దరికి ఫోన్ చేసి గ్రామంలో ఏం జరుగుతుందని వాకబు చేస్తే.. మాకేం తెలియదన్న బా వుల వద్దకు వెళ్లామని సమాధానమిచ్చారు. సాయిరెడ్డిని కడసారి చూసుకుని అంతిమయాత్రలో పాల్గొనేందుకు అధికారం ఆంక్షలు విధించినా.. బంధువులు పెద్ద సంఖ్య లో వచ్చారు. గ్రామస్తులు ఇండ్లకే పరిమితమయ్యారు.
బంధువుల, ఆప్తులు, కడుపున పుట్టిన వారి మౌన రో దనల మధ్య సాయిరెడ్డి అంతిమయాత్ర సాగింది. వారి వ్యవసాయ పొలంలో సాయిరెడ్డి భౌతిక కాయానికి అం త్యక్రియలు నిర్వహించారు. సాయిరెడ్డి పెద్ద కొడుకు వెం కట్రెడ్డి చితికి నిప్పంటించాడు. ఆప్తులు, బంధువులు సా యిరెడ్డి మంచితనాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారం ఉన్నంత మాత్రాన నిజాలు మాట్లాడితే హింసపెడతారా.. పండు ముదుసలి అని చూడకుం డా వేధింపులకు గురిచేసి ప్రాణాలు తీసుకునే వరకు వెం టపడుతారా అంటూ బాధను వ్యక్తం చేశారు.
సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి రగిలిపోతుంది. ఊరి మంచి కోరే వ్యక్తిని ఆత్మహ త్య చేసుకునేవరకు వెంటాడిన అధికారంపై లోలోపల మండిపోతుంది. ఎప్పుడు వీరిదే అధికారం ఉండదు కదా.. అధికారం పోయిన రోజు వీళ్ల బతుకులను చూస్తామనే రీతిలో గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన రెడ్డి, బీసీ, ఎస్సీలు 90శాతానికిపైగా అధికారంపై ఆగ్రహంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఆగ్రహజ్వాల మహాజ్వాలగా మారి అధికారాన్ని దహించి వే స్తుందనడంలో సందేహమే లేదు.