మక్తల్ : విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. మక్తల్ మండలంలోని ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రలను పోషించి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. జిల్లా కలెక్టర్గా అఖిల, డీఈవోగా నవీన్, ఎంఈవోగా అజీమ్, హెచ్ఎంగా బీ నవీన్ వ్యవహరించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో చేపట్టిన సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు రాకేష్ కుమార్, జగదీష్, పావని విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.