నాగర్‌కర్నూల్, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పా ఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించనున్నారు. దీంతోపాటు పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికిగానూ తొలి విడుతలో జిల్లా యూనిట్‌గా పాఠశాలలను ఎంపిక చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 885 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. తొలి విడుతగా 290 స్కూ ళ్లను ఎంపిక చేశారు. ఇందులో 135 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు కలెక్టర్ పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఈ నెల 10వ తే దీ వరకు వంద శాతం స్కూళ్లకు అనుమతు లు రానున్నాయి. కాగా, ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆంగ్లమాధ్యమంపై శిక్షణ పూర్తి చేశా రు. పాఠశాలల్లో నీటి సౌకర్యం, టాయిలెట్లు, విద్యుత్, ఫర్నీచర్, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త వాటి నిర్మాణాలు చేపట్టడం, డిజిటల్ తరగతులు వంటి పనులు చేపట్టనున్నారు. పాఠశాలల్లో సృజనాత్మకత కనిపించేలా పెయింటింగ్ వే యిస్తున్నారు.
ఈ పనులు జిల్లాలో ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నిధులను కూడా మంజూరు చేసింది. అలాగే ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీ నిధుల నుంచి 40 శాతం పాఠశాలల అభివృద్ధికి కేటాయించనున్నారు. ఇలా నాగర్‌కర్నూల్ జిల్లాలో చేపట్టే పనులకుగానూ రూ.82 కోట్లను కేటాయించింది. ప నులు చేపట్టిన వెంటనే బిల్లులను మంజూరు చేసేలా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులకు ఆ దేశాలు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాను ప రిశీలిస్తే.. మహబూబ్‌నగర్‌లో 291, నారాయణపేటలో 174, వనపర్తిలో 183, జోగుళాంబ గద్వాలలో 161 స్కూళ్లు ఎంపికయ్యా యి. వేసవి సెలవులు ఉన్నా.. పథకానికి ఎం పికైన స్కూళ్లలో ప్రతి రోజూ ఓ ఉపాధ్యాయు డు అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో ఒకటి, మండలాల్లో రెండు పాఠశాలలను ఎంపిక చేసి నమూనాగా ఈనెలాఖ రు నాటికి 12 రకాల పనులను పూర్తి చే యనున్నారు. నాగర్‌కర్నూల్ మండ లం గగ్గలపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో రూ.46.16 లక్షలతో చే పట్టే పనులకు, తాడూరు మండలం మేడిపూ ర్ ప్రాథమిక పాఠశాలలో రూ.34లక్షలతో చేపట్టే పనులకు, రూ.1.14 కోట్లతో చే పట్టనున్న ఉన్నత పాఠశాల పనుల కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం శంకుస్థా పన చేయనున్నారు. మొత్త మ్మీద పాఠశాలలు తెరుచుకునేసరికి ఆధునిక వసతులతో విద్యార్థులకు అందుబాటులోకి రానున్నా యి.
14, 15 తేదీల్లో ప్రాపర్టీ షో..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రో జులపాటు మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రాపర్టీ షో జరుగనున్నది. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సుదర్శన్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేయనున్న ఈ షోను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాపర్టీ షో జిల్లాలో మొదటిసారి నిర్వహిస్తుండడంతో నూతన గృహాలు, ఇండ్ల స్థలాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే వేదికపై లభించనున్నది. జిల్లాకు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధలు, భవన ని ర్మాణంలో అపార అనుభవం ఉన్న బిల్డర్లు ఈ ప్రాపర్టీషోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వా రా వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు. అలాగే ఇండ్ల స్ధలాలు, భవనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు నిబంధనలకు లోబడి రుణ సదుపాయం కల్పించేందుకు పలు జాతీయ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొననున్నాయి. ఒకే వేదికపైకి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ఇతర నిర్మాణ సంస్థలు, బ్యాం కులు వస్తుండడంతో వినియోగదారులకు అవసరమైన సమాచారం ఒకే చోట లభించనున్నది. మరోవైపు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్న రియల్ ఎస్టే ట్ సంస్థలు తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఆఫర్లు ఇ చ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
నేడు పనులకు శంకుస్థాపన..
మన ఊరు-మన బడి పథకం కింద జి ల్లాలో 290 పాఠశాలలు తొలి విడుతలో ఎంపికయ్యాయి. ఇందులో 135 పాఠశాలలకు పరిపాలనా అనుమతులు వ చ్చాయి. రూ.82 కోట్లతో ఈ పను లు చేపట్టనున్నాం. మేడిపూర్, గగ్గలపల్లి స్కూళ్లలో చేపట్టను న్న పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాట్లు పూర్తి చేశాం.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్‌కర్నూల్