జడ్చర్లటౌన్, డిసెంబర్11 : జడ్చర్ల మం డలం కొత్తతండా శివారులో మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యా హ్నం స్కార్పియో, స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం కొత్తతండాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందడంతో అంత్యక్రియలు ముగించుకుని అదే తండాకు చెం దిన శంకర్‌నాయక్, సాయి, శంకర్ కలిసి స్కూటీపై తిరుగు ప్రయాణంలో కొత్తతండా వద్ద రోడ్డు దాటుతుండగా జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న స్కార్పియో ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఎస్వీఎస్ దవాఖానకు తరలించారు. ఇటీవల నిర్మించిన జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడంతోనే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సత్వరమే స్పీడ్ బ్రేకులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తండావాసులు రాస్తారోకో చేపట్టా రు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు, ఎస్సై వెంకటేశ్ అక్కడికి చేరుకొని తండావాసులకు సర్ధిచెప్పేందుకు యత్నించారు. వెంటనే స్పీడ్ బ్రేకులు ఏర్పాటు చేసేవరకు రాస్తారోకో విరమించమని భీష్మీంచుకుని బైఠాయించారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకొని తండావాసులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకునేలా సం బంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇవ్వడంతో తండావాసులు రాస్తారోకోను విరమించారు.