యాజమాన్య పద్ధతులతోనే.. పంటలకు రక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. సరైన పద్ధతులు పాటిస్తే పంటలను చీడపీడల నుంచి పాకాడుకోవచ్చని తెలిపా రు.
- అధిక వర్షాలతో చీడపీడల బెడద
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న శాస్త్రవేత్తలు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. సరైన పద్ధతులు పాటిస్తే పంటలను చీడపీడల నుంచి పాకాడుకోవచ్చని తెలిపా రు. అన్ని పంటల్లో లోతు కాల్వల ద్వారా నీటిని బయటకు తీసివేయాలని చెప్పారు. కలుపును అదుపుచేయడం వల్ల మొక్కల వేర్లకు గాలి తగిలి పెరుగుదల బాగుంటుందన్నారు.
– హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)
వరి..
వరి సాగులో ఇప్పటి వరకు నార్లు పోసుకొని రైతులు దమ్ము చేసిన పొలాల్లో స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేసుకొని నేరుగా విత్తనం వెదజల్లుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా నార్లు పోసుకోవాలనుకునే రైతులు ఎత్తైన నారుమడుల పద్ధ్దతిలో సిఫారసు చేయబడిన రకాలను దొడ్డుగింజల రకాలు.. జేజీఎల్ 24423, కేఎన్ఎం 118, జేజీఎల్ 18047, ఎంటీయూ 1010, సన్న గింజల రకాలు.. ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 962 రకాలను ఎంపిక చేసుకొని ఎకరానికి 20-25 కిలోల వరి విత్తనాన్ని ఉపయోగించి 2గుంటల నారుమడిలో నారు పెంచి 20-25 రోజుల వయస్సు గల నారుతో నాట్లు పూర్తి చేసుకోవాలి.
వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రాముల కార్బొఫ్యూరాన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి నారుమడిలో చల్లుకోవాలి.
40-45 రోజుల వయస్సు కల్గిన స్వల్పకాలిక రకాల ముదురు నారును ఉపయోగించి నాల్లు వేసుకోరాదు.
తప్పనిసరి పరిస్థితులలో ముదురు నారుతో నాట్లు వేసినట్లయితే ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి. కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు 6-8 మొక్కల చొప్పున నాటు వేయాలి. నత్రజని ఎరువును సిఫారసు కంటే 25 శాతం పెంచి మూడు దఫాలుగా గాక రెండు దఫాలుగా అంటే 70 శాతం నాటే సమయంలో మిగతా 30శాతం అంట్లు కట్టే సమయంలో వేయాలి.
పత్తి..
పత్తి విత్తుకునే సమయం దాటిపోయింది. అందువల్ల పత్తి విత్తవద్దు. విత్తితే సరైన పెరుగుదల లేక పూత వచ్చి దిగుబడులు తగ్గుతాయి. అధిక వర్షాలతో నేలలో తేమ అధికంగా ఉండి ఆంథోసయనిన్ పిగ్మేంట్ గాఢత పెరగడం వల్ల ఆకులు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. ఇది చూడడానికి మెగ్నీషియం దాతువు లోపంలాగా కనబడుతుంది. కావున మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. వర్షం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతింటే మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరునీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా మొక్కలకు 3-5 సెం.మీ. దూరంలో అంతే లోతులో వేసి మట్టితో కప్పాలి. కలుపు నివారించడానికి ఎకరాకు 500 మి.లీ. క్విజలోఫాప్ ఇథైల్ 4శాతం ఈసీ, పైరిథాయోబ్యాక్ సోడియం 6శాతం ఈసీ లేదా 250మి.లీ., ప్రోపాక్విజాఫాప్ 10శాతం ఈసీ, 250 మి.లీ. పైరిథాయోబ్యాక్ సోడియం 10శాతం ఈసీ మిశ్రమం చేసి కలుపుమందును పిచికారీ చేయాలి.
కంది..
గత సంవత్సరంతో పోలిస్తే వర్షాకాలంలో కంది విస్తీర్ణం 1.5 లక్షల ఎకరాల్లో తక్కువగా ఉంది. దేశంలో 15లక్షల ఎకరాల్లో సాగులోటు ఉన్నది. ఈ సంవత్సరం కంది పంటకు ధర అధికంగా వచ్చే సూచనలున్నాయి. అందువల్ల ప్రస్తుతం కంది పంటను విత్తుకోవచ్చు. మధ్య, స్వల్పకాలిక కంది రకాలైన వరంగల్ 97 లాంటి రకాలను ఎంపిక చేసుకొని మొక్కల మధ్య ఎడము తగ్గించి (120-120 సెం.మీ) ప్రస్తుత సమయంలో విత్తుకోవచ్చు. నేలలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. నివారణకు 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 0.5 గ్రాముల సిట్రిక్ ఆసిడ్, 20 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాల వల్ల ఫైటాప్తోర ఎండు తెగులు గమనిస్తే నివారణకు 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
నువ్వులు..
నీటి వసతి ఉన్న ప్రాంతాలు, కాల్వల ద్వారా నీరు వచ్చే ప్రాంతాల రైతులు ఆగస్టు 31 వరకు శ్వేత, జేసీఎస్1020, జేసీఎస్ 2454, హిమ రకాలను ఎంపిక చేసుకొని విత్తుకోవచ్చు. పంటను చీడపీడల నుంచి రక్షించుకునేందుకు కిలో విత్తనానికి 3 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్, 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మందును వేసుకోవాలి.
చెరుకు..
అధిక వర్షాలకు చెరుకు గడలు / మొక్కలు నేలవాలకుండా నివారించడానికి ఎండిన ఆకులతో మొక్కలను జడలు అల్లుకోవాలి. వానలు తగ్గిన తర్వాత ఎకరాకు 50కిలోల పోటాష్ మరియు 50కిలోల యూరియా మొక్కల మొదళ్ల దగ్గర వేసి గుంటలు చేసి కప్పుకోవాలి.
మొక్కజొన్న..
95 నుంచి 105 రోజుల మధ్యకాలిక సంకరాలైన డీహెచ్ఎం 117, 90-95 రోజుల పంటనిచ్చే డీహెచ్ఎం 121 లేదా స్వల్పకాలిక సంకరాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో విత్తిన మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది. నివారణకు 6.0 మి.లీ. సయాంట్రానిలిప్రోల్, థయోమిథాక్సాం మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవాలి. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఎకరాకు 20కిలోల యూరియా, 15 కిలోలల పోటాష్‌ను వేసుకోవాలి. ఆగస్టు నెలలో విత్తన మొక్కజన్న పంటలో కత్తెర పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందునా, పురుగు నివారణకు 8-10 లింగాకర్షక బుట్టలను పంటకు ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి.
మోకాలు ఎత్తుదశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవచ్చు. రైతులు పంటను విత్తిన 15 రోజుల వ్యవధిలో కత్తెర పురుగు గమనించినట్లయితే, నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుసుడుల లోపల తడిసేలా పిచికారీ చేయాలి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

