Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమాల విషయంలోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సమంత.. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తాజాగా తన వర్కౌట్ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమాల విషయంలోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సమంత.. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తాజాగా తన వర్కౌట్ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో కంటే హీరోయిన్ కృతి కర్బందా చేసిన ఓ చిన్న కామెంట్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. సమంత తాజాగా తన వ్యాయామ ప్రయాణానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు సాగిన వర్కౌట్‌కు సంబంధించిన దృశ్యాలను ఇందులో చూపించారు.
ఈ వీడియోకు ‘ది ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ పోస్టుపై హీరోయిన్ కృతి కర్బందా స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత వీడియోకు స్పందిస్తూ.. ‘సెండింగ్ ఆల్ 3 ఆఫ్ యూ సో మచ్ లవ్’ అంటూ కామెంట్ చేశారు. అంటే మీ ముగ్గురికీ ఎంతో ప్రేమను పంపిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ ముగ్గురు ఎవరు? కృతి అలా ఎందుకు కామెంట్ చేశారు? అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. కృతి కర్బందా చేసిన ‘ఆల్ 3’ అనే పదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. కొందరు సమంత, ఆమె భర్త, పుట్టబోయే బిడ్డను ఉద్దేశించే కృతి అలా కామెంట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ ముగ్గురు అంటే సమంతకు కవల పిల్లలు పుట్టబోతున్నారనే సంకేతమా? అంటూ ఊహాగానాలు చేస్తున్నారు.
అయితే కృతి కర్బందా తన కామెంట్లో అసలు ఎవరిని ఉద్దేశించారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఆమె సరదాగా, ప్రేమతో చేసిన వ్యాఖ్యకు నెటిజన్లు రకరకాల అర్థాలు తీస్తున్నారు. దీంతో సమంతకు కవల పిల్లలు పుట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై సమంత కానీ, కృతి కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరిగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు కృతి కర్బందా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘తీన్ మార్’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

