YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేదిక మార్పుపై ఎట్టకేలకు స్పందించారు.
YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేదిక మార్పుపై ఎట్టకేలకు స్పందించారు. యలహంక ప్రాపర్టీ, వివాహ వేదిక అంశంపై జరుగుతున్న పరిణామాలపై ఆమె తీవ్ర భావోద్వేగంతో ఒక ప్రకటన విడుదల చేశారు. సొంత ఇంటిలోనే తన బిడ్డ పెళ్లి చేయాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ కోరిక నెరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడి సాక్షిగా యలహంక ఆస్తి మాదే:
నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం అని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ (YS Rajasekhara Reddy) తిరిగిన ఇల్లు కావడంతో పాటు, అది తమ పిల్లల హక్కు అయినందున తన కుమార్తె అంజిలి కోరిక మేరకు అక్కడే వివాహం జరపాలనుకున్నట్లు షర్మిల తెలిపారు. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని, కానీ తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని ఆమె చాలా బాధపడ్డారు.
నా కుమార్తె అంజిలి పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం” అని షర్మిల వెల్లడించారు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఆమె మనసారా ఆకాంక్షించారు. అలాగే వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి తన బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
— YS Sharmila (@realyssharmila) October 31, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

