G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
G20 Nations | చమురు సరఫరా (Oil supply) పై ఆంక్షలు, కీలక చమురు రవాణా మార్గాలను అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలిగించడాన్ని భారత విదేశాంగ శాఖ (India's Foreign Ministry) మంత్రి ఎస్ జైశంకర్ (S.Jaishankar) తీవ్రంగా ఖండించారు. చమురు ధరలను గుప్పిట్లో ఉంచుకునేందుకే కొన్ని దేశాలు ఇంధన వాణిజ్యంపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుపుతున్నాయని ఆయన విమర్శించారు.
G20 Nations : చమురు సరఫరా (Oil supply) పై ఆంక్షలు, కీలక చమురు రవాణా మార్గాలను అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలిగించడాన్ని భారత విదేశాంగ శాఖ (India’s Foreign Ministry) మంత్రి ఎస్ జైశంకర్ (S.Jaishankar) తీవ్రంగా ఖండించారు. చమురు ధరలను గుప్పిట్లో ఉంచుకునేందుకే కొన్ని దేశాలు ఇంధన వాణిజ్యంపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుపుతున్నాయని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న చమురు సంక్షోభం ఉత్పత్తిపరమైనది కాదని, అనిశ్చితి, అంతరాయాలు, భారీ ధరలు, లభ్యతలో సవాళ్లే అసలైన కారణమని జైశంకర్ అన్నారు. జీ20 దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్కడే ఉండటం గమనార్హం. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షలు, పశ్చిమాసియా నుంచి ఇంధన సరఫరాకు అంతరాయం, రష్యా డీజిల్ అమ్మకాలపై అడ్డంకులు వంటి పరిణామాల వేళ జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ వ్యవహారాల్లో పరస్పర ఆధారిత సూత్రాన్ని తక్కువ అంచనా వేయకూడదని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వంట అవసరాల కోసం భారత్‌కు నమ్మకమైన ఎల్పీజీ సరఫరాలు అవసరమన్నారు. ఆర్థిక వనరుల లభ్యతను విస్తృతం చేయడంతోపాటు, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలను ప్రోత్సహించాలని జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. సవాళ్లను ఎదుర్కోవడంలో సైనిక చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వవని జైశంకర్ అన్నారు.
సమస్యలను పరిష్కరించుకోవడానికి దౌత్యానికి అవకాశం ఇవ్వాలని జీ20 దేశాలకు సూచించారు. కీలక చమురు రవాణామార్గాల్లో నౌకలు, నావికులపై దాడులు ప్రస్తుతం తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. యూఎన్క్లోస్ (UNCLOS) ఒప్పందం ప్రకారం నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, దాడులను నిలిపివేయడం అవసరమని చెప్పారు. ఈ దాడులవల్ల పరోక్షంగా ఇంధనం, ఆహారం, ఎరువుల లభ్యత ప్రమాదంలో పడుతున్నాయని జైశంకర్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

