మహబూబ్‌నగర్, జూన్ 11 : నేటి నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ బడులకు రవాణా సదుపాయాలు లేకపోయినా ‘ప్రైవేట్’కు మా త్రం చాలా అవసరం. ప్రతి ఏడాది ప్రారంభంలో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,264 స్కూల్ బస్సులుండగా.. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. కానీ, నేటివరకు 40 శాతం బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షకు వచ్చాయి. సామర్థ్య పరీక్షలు చేసుకోకపోతే వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వాహన చట్టానికి తూట్లు..
బస్సుల నిర్వహణలో ఆయా పాఠశాలలు యాజమాన్యాలు వాహనాల చట్టానికి తూట్లు పొడుస్తున్నాయి. 32 నిబంధనల్లో సగాన్ని కూడా పాటించడం లేదు. అత్యవసర ద్వారాలను పిల్లలు తీస్తారనే ఉద్దేశంతో ముందుగానే వాటిని మూసి ఉంచుతున్నారు. దీంతో ప్రమాదం సంభవించినప్పుడు విద్యార్థులు తప్పించుకునే వీలు లేకుండాపోతున్నది. అగ్ని ప్రమాద సమయంలో ఉపయోగపడే యంత్రాలను సైతం అందుబాటులో ఉంచడం లేదు. ఫిట్నెస్ చెకింగ్ సమయంలో తీసుకొస్తున్న సామగ్రిని డ్రైవర్లు తదనంతరం అందుబాటులో ఉంచడం లేదు. బస్సు కొనుగోలు చేసిన సమయంలో వచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్లను కూడా మార్చడం లేదు. నిబంధనల్లోని ఏ ఒక్క అంశానికి కూడా రిజిస్టర్లు మెయింటేన్ చేయడం లేదు. చాలా చోట్ల వ్యాలిడిటీ అయిపోయిన బస్సులను నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఫుట్‌రెస్టులు ఎత్తుగా ఉండడంతో బస్సు ఎక్కేటప్పు డు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో క్లీనర్లను నియమించడం లేదనే విమర్శలున్నాయి. ఏటా మే 15వ తేదీ నాటికి పాఠశాల బస్సుల ఫిట్నెస్ వ్యాలిడిటీ ముగుస్తుంది. దీంతో విద్యాసంస్థల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ పరీక్షలు చేయించా లి. అయితే ఈ ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రం పొందకుండా వాహనాలు నడిపితే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో బుధవారం నుంచి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వ్యాలిడిటీ పూర్తయిన బస్సును అధికారులు గుర్తించి సీజ్ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌లో 442, నా రాయణపేటలో 129, నాగర్‌కర్నూల్‌లో 243, వనపర్తి లో 226, గద్వాల లో 224 స్కూ ల్ బస్సులున్నాయి.
60 శాతమే..
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సుల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోటరు వాహనాల చట్టం నిబంధనల మేరకు ఏడాదికోసారి బస్సుల సామర్థ్య (ఫిట్నెస్) పరీక్షలు చేయించాలి. కానీ జిల్లా వ్యాప్తంగా 222 బస్సులుండగా.. ఫిట్నెస్ పరీక్షకు మాత్రం 139 బస్సులే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపైకొస్తే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశామని రవాణాశాఖ ఇన్చార్జి అధికారి వెంకటేశ్వర్రావు తె లిపారు. 15 ఏండ్లు పైబడిన బస్సులను నడపొద్దని, విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర వాహనాలపై నిఘా ఉంచామన్నారు. డ్రైవ ర్లు మత్తు పదార్థాలు, మద్యం తాగకూడదన్నా రు. 28వ తేదీలోగా పాఠశాల బస్సులన్నీ ఫిట్నెస్ నిరూపించుకోవాలని సూచించారు.
ఫిట్నెస్ లేకుంటే సీజ్ ..
స్కూల్ బస్సుల ఫి ట్నెస్పై సీ రియస్‌గా దృష్టి సారిస్తు న్నాం. జిల్లాలో ఉ న్న స్కూల్ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. లేదంటే స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీజ్ చేస్తాం. విద్యార్థులను తరలించే ఆటోలపైనా చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వాహన నిబంధనలను పాటించాలి. ప్రతి బస్సులో లాగ్‌బుక్ తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమస్యలను ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలి. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.
– వాసుదేవ్, జిల్లా ఇన్చార్జి రవాణా అధికారి, మహబూబ్‌నగర్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..