నెలన్నర రోజుల వేసవి సెలవులు పూర్తయ్యాయి. విద్యాలయాల తలుపులు గురువారం నుంచి తెరచుకుంటున్నాయి. విద్యార్థులకు పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని బడుల్లో గతేడాది ఎదుర్కొన్న సమస్యలే మళ్లీ పునరావృతమయ్యే పరిస్థితి. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా బడులు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు వేధిస్తున్నాయి.
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాం.. మెరుగైన విద్యాబోధన.. నాణ్యమైన మధ్యాహ్న భోజనం.. ఉత్తమ ఫలితాలు.. ఇలా ఊరూరా తిరిగి గొప్పలు చెబుతున్నారు విద్యాశాఖ అధికారులు. తీరా ఆచరణలో చూస్తే.. శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపడుతాయో తెలియని భవనాలు.. వర్షం వస్తే నీళ్లు కారే గదులు.. పెచ్చులూడే శిథిలాలతో భయంభయంగా వరండాలోనే చదువులు సాగుతున్నాయి. విద్యార్థును లకు కనీస అవసరాలైన తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు సైతం లేని పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు.
ఈ విద్యా సంవత్సరం (2025-26)లో పాఠశాలలు గురువారం (12న) పునః ప్రారంభం కానున్నాయి. వి ద్యార్థులకు నూతన ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందించి పండగ వాతావరణంలో పాఠశాలలు ప్రా రంభిస్తామంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అభివృద్ధి ప నులు, అదనపు తరగతి గదులు, మూత్రశాలల ని ర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదనే చె ప్పవచ్చు.
పాఠ్య పుస్తకాలు సైతం 100 శాతం పా ఠశాలలకు చేరుకోలేదు. ఏకరూప దుస్తులకు గాను పా ఠశాలల వారీగా వచ్చిన దస్ర్తాన్ని మండలాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు అధికారులు అందిం చారు. ఏకరూప దుస్తుల కుట్టుకూలి పనులు 75 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఏకరూప దుస్తులు, పాఠ్య పు స్తకాల సరఫరా తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈ వో లు, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సమస్యలకు నిలయాలు..
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స దుపాయాలు కొరవడి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొన్నాయి. కొన్ని చోట్ల తాగునీరు, మరుగుదొడ్లు సమస్య తీవ్రంగా వేధిస్తోంది. స్వచ్ఛత ఉత్తమాటే అన్న చందంగా ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కార్మికు లు, స్వీపర్లు 1,693 మంది, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,315, వనపర్తి 1,223, నారాయణపేట 1,346, జోగుళాంబ గద్వాల జిల్లాలో 904 మంది స్వీపర్లు గతంలో పనిచేసేవారు.
వారి స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఎంపిక చేసిన సిబ్బందితోనే పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామని గతేడాది జులై 9న ప్రక టించారు. అది నేటికీ వంద శాతం పూర్తిస్థాయిలో అమ లుకు నోచుకోలేదు. చాలా వరకు పారిశుధ్య పనులు చేయించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు సుముఖత చూపడం లేదు. చాలా చోట్ల విద్యార్థులు ఉన్న చోట ఉ పాధ్యాయులు లేరు, ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరన్నట్లుగా పరిస్థితి ఉన్నది.
ఉమ్మడి జిల్లాలో పాఠశాలల వివరాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,182 పాఠశాలలు ఉం డగా, వాటిలో ప్రాథమిక పాఠశాలలు 2,335, ప్రా థమికోన్నత పాఠశాలలు 839, ఉన్నత పాఠశాలలు 1,008 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం విద్యార్థులు 5, 42,318 మంది విద్యార్థులు ఉన్నారు. సాంఘిక సం క్షేమ గురుకులాలు 32, గిరిజన సంక్షేమ గురుకులాలు 18, మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాలు 25, మైనార్టీ సంక్షేమ గురుకులాలు 25, తెలంగాణ రాష్ట్ర గురుకులం 1, కేజీబీవీలు 72 ఉన్నాయి. వీటి పరిధిలో 70వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉమ్మ డి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ మండల, జిల్లా పరి షత్, కేజీబీవీ, టీఎస్ మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, అంధుల పాఠశాల, కేంద్రీయ, మినీ గురుకులాలు, సంక్షేమ శాఖల గురుకుల విద్యాలయాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలోనే బాగు..
విద్యార్థులను బడిలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. బడి అంటేనే భవిష్యత్తుకు బాటలు వేసే గుడి. పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదవా లన్నా, ఉత్తమ ఫలితాలు సాధించాలన్నా ప్రైవేటు పాఠశా లల్లోనే చేర్పించాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉండేది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. ‘మన ఊరు-మనబడి’, మన ఊరు-మన బస్తీ అనే పేరుతో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను సుందరంగా తీర్చి దిద్దింది. అత్యాధునిక వసతులతో చిన్నారులు సైతం నేల పై కూర్చోకుండా బెంచీలపై కూర్చునేలా ఆధునీకరణ చర్యలు చేపట్టి డ్యూయల్ డెస్క్‌లు ఏర్పాటు చేసింది. దీం తో పాటు డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రభు త్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంతో పాటు సకల సదు పాయాల కల్పనకు నిలయాలుగా మా రాయి. ప్రభుత్వం మారడంతో మిగులు పనులు చాలా చోట్ల అసంపూర్తి గానే మిగిలాయి.
విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారంటే..
గతానికి భిన్నంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే దాదాపు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేశామని చెబుతున్నారు. ఇప్పటికే రాత పుస్తకాలను యూడైస్ ప్లస్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలకు ఆర్టీసీ కార్గో సేవల ద్వారా చేరవేశా మంటున్నారు. జిల్లా కేంద్రాల నుంచి మం డలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు అందించినట్లు చెబుతున్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
వెంటాడుతున్న సమస్యలు
గద్వాల టౌన్, జూన్ 11 : జిల్లాలో మొత్తం 644 పాఠశాలలు ఉన్నాయి. ప్ర భుత్వ పాఠశాలలు 460, కేజీబీవీలు 12, ట్రయిబల్ 1, బీసీ వెల్ఫేర్ 5, మై నార్టీ 1, యూఆర్ఎస్ 1, టీఎస్ఆర్ఏ బీ చుపల్లి 1, సోషల వెల్ఫేర్ 6, ప్రైవేట్ ఏయిడెడ్ 2, ప్రైవేట్ అన్ఏయిడెడ్ 139 ఉన్నాయి. ఇం దులో 8పాఠశాలలో ఒక్క వి ద్యార్థి కూడా ప్రవేశం పొందలేదు. ఈ ఏడా ది ఆ స్కూళ్లల్లో విద్యార్థులను చేర్పించేందుకు అధికారులు కృషి చే స్తున్నారు.
పాఠశాలలు పునఃప్రారంభంకానుండగా సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇ ప్పటికే 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. సరైన గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అదనపు తరగతులు ని ర్మాణదశలోనే ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే కాంట్రాక్టర్ ప నులు నిలిపివేశారని ఉపాధ్యాయులు చె ప్తున్నారు. మోమిన్ మహాల్లా పాఠశాలలో నీటి వసతి కరువైంది. మరికొన్ని పాఠశాలలో బాత్రూంలు, మరుగుదొడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు. గంజిపేటలోని ప్రభుత్వ పా ఠశాల భవనం శిథిలమైంది.