మద్దూర్ (కొత్తపల్లి), ఫిబ్రవరి 18 : పూటగడవడమే కష్టమైన పేద కుటుంబం.. మూడు నెలలుగా తనకు రావాల్సిన వేతనం అందించడం లేదని అల్లీపూర్ పాఠశాలలో స్కావెంజర్‌గా పనిచేస్తున్న ఓ భీమమ్మ తన కుమారుడితో కలిసి పాఠశాల ఉపాధ్యాయు లు, ఎస్ఎంసీ చైర్‌పర్సన్‌ను అడుగగా, పోలీసులతో చితకబాదించిన ఘటన కొత్తపల్లి మండలంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన బాధితుల కథనం ప్రకారం.. అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ పదేండ్లుగా స్కావెంజర్‌గా పనిచేస్తున్నది. నెలకు రూ.3వేల వేతనం ఇస్తున్నారు.
కాగా, ఇన్నాళ్లుగా సాఫీగా వేతనం ఇవ్వగా, మూడు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. కాగా, భీమ మ్మ కుమారుడు ఎల్లయ్య భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య నాలుగు నెలల కిందట చనిపోయింది. పేద కుటుం బం కావడంతో ఆర్థికంగా ఇబ్బందు లు ఎదురయ్యాయి. తన తల్లి మూడు నెలల వేతనం రాకపోవడంతో పాఠశాల హెచ్ఎంకు ఫిర్యా దు చేశారు. ఆమె స్పందించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి సోమవారం రశీదు తెప్పించి సంతకం చేసి స్కూల్ చైర్ పర్సన్‌కు పంపించారు. ఇందుకు పాఠశాల చైర్పర్సన్ రశీదును తిరస్కరించి నేను సంతకం చేయను.. కాంగ్రెస్‌నేత, మాజీ సర్పంచ్ రమేశ్‌రెడ్డి సంతకం చేయొద్దని చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు ఎల్లప్ప తన తల్లికి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇ వ్వడం లేదని ఆగ్రహించగా, పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మ, మాజీ సర్పంచ్ రమేశ్‌రెడ్డి మమ్మల్ని ఎల్లప్ప తిట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ని జానిజాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకుడు, పాఠశాల చైర్మ న్ మాటలు విని సీఐ సైదులు, ఎస్సై విజయ్‌కుమార్ ఎల్లప్పను విచక్షణ రహితంగా కొట్టా రు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. మూడు నెలల జీతం అడిగినందుకు అన్యాయంగా తిరస్కరించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొట్టి బూ టుతో తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచక్షణా రహితంగా కొట్టిన సీఐ, ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్, బీజేపీ, వివిధ సం ఘాల నాయకులు మద్దతు తెలిపారు.
ఎల్లప్పపై దాడి విషయమై ఎస్సై విజయ్‌కుమార్ వివరణ కోరగా, పాఠశాల చైర్పర్సన్ ఫిర్యాదు మేరకు విచారణ కోసం స్టేషన్‌కు ఎల్లప్పను పలిపించినట్లు తెలిపారు. విచారణ చేపట్టామని, కొట్టలేదని వివరించారు.