బిజినేపల్లి, నవంబర్ 20 : మండలంలోని వట్టెం శివారు లో ఓ పాఠశాల బస్సును ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొట్టడం తో బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు కా గా.. మరో 16 మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం త ప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలానికి చెందిన మేధాన్స్ ప్రైవేట్ పాఠశాల బస్సులో రోజూమాదిరిగానే తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి, బిజినేపల్లి మండలంలోని రాంరెడ్డిపల్లి, వట్టెం, బాజీపూర్‌లో విద్యార్థులను ఎక్కించుకొని వస్తున్నారు.
ఈ క్రమంలో వట్టెం నుంచి బాజీపూర్ వెళ్లే మార్గమధ్యంలో పొలాల్లో నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ రోడ్డుపై వెళ్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 18మంది విద్యార్థుల్లో ప్రియాంక, చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పాఠశాల విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన చుట్టుపక్కలవారు 108కు సమాచారం ఇచ్చి గాయపడిన విద్యార్థులను నాగర్‌కర్నూల్ ఏరియా దవాఖానకు తరలించారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బస్సు డ్రైవర్ మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
బస్సు ప్రమాద ఘటనపై స్కూల్ యాజమాన్యానికి డీఈ వో గోవిందరాజులు షోకాజ్ నోటీసు అందజేశారు. ఈ విష యం తెలిసిన డీఈవో మొదటగా ఘటనాస్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. మేధామ్స్ పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అం దజేశారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల భద్ర త, పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.