మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 1 : ఎ స్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌరస్తాలో వివిధ కుల సం ఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్గీకరణ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సం దర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో చాలామం ది రిజర్వేషన్లు తొలగించాలని గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని గత బీఆర్ఎస్ ప్ర భుత్వంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పం పినట్లు చెప్పారు. తాను మంత్రిగా ఉన్న స మయంలో ఎస్సీ వర్గీకరణ అంశం పై పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడానన్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సుప్రీం తీర్పును వెంటనే అమలు చేయాలని ఆయ న డిమాండ్ చేశారు.