భూత్పూర్, డిసెంబర్ 26: మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండ్లు ఇప్పించాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరింగ్ నర్సిములు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అమిస్తాపూర్‌లో పేదలకు ఇండ్లను ఇవ్వాలనే ఉద్దేశేంతో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి 288ఇండ్లను మంజూరు చేయించారని అన్నారు. ఇందులో భూత్పూర్-మహబూబ్‌నగర్ రోడ్డు విస్తరణలో అమిస్తాపూర్ గ్రామస్తులు 42మంది ఇండ్లను కోల్పోయారని, ముందుగా వారికి ప్రత్యేక డిప్ద్వారా ఇండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 246ఇండ్లను కౌన్సిలర్ల సమక్షంలోనే లిక్కిడిప్ ద్వారా ఇండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, తాసిల్దార్ చెన్నకిష్టన్న సమక్షంలోనే పేదలను గుర్తించి ఇండ్లకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇండ్లు కావాలనే వారి సంఖ్య దాదాపు 800ఉండగా ఇండ్లు మాత్రం 246మాత్రమే ఉన్నాయని తెలిపారు. మిగిలిన పేదలకు బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి పంపిణీ చేయాలని, ఎమ్మెల్యే పంపిణీ చేసిన ఇండ్లపై మరోసారి ఆందోళన కార్యక్రమాలను చేపడితే గ్రామాల్లో బీజేపీ నాయకులు తిరగలేరని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్కుమార్గౌడ్, సింగిల్‌విండో డైరెక్టర్ గడ్డంరాములు, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ సదానంద్‌గౌడ్, తిరుపతయ్యగౌడ్, బ్రహ్మయ్య, ప్రేమ్, రాకేశ్, శ్రీశైలం, బాబు తదితరులు పాల్గొన్నారు.