రైతు సమస్యలపై బీఆర్ఎస్ నిరసన గళం
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ విమర్శించారు. మున్సిపాలిటీ కేంద్రంలో మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆధ్యర్యంలో రైతు సమస్యలపై ధర్నా శనివారం చేపట్టారు.
- రేవంత్ పాలనలో అరిగోస పడ్తున్నారని ఫైర్
- కేంద్రం యూరియా ధరలు పెంచిందని ఆరోపణ
- భూత్పూరులో విజయవంతమైన ధర్నా
భూత్పూర్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ విమర్శించారు. మున్సిపాలిటీ కేంద్రంలో మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆధ్యర్యంలో రైతు సమస్యలపై ధర్నా శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వకపోవడం, పండించిన వరి ధాన్యాన్ని కొనకపోవడం, రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయకపోవడం, రైతుభీమా ఎత్తివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారన్నారు.
అదేవిధంగా రైతులకు సరపడా యూరియాను సకాలంలో పంపిణీ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనలేని స్థితిలో ఉందని, క్వింటాకు 19 కిలోల తరుగు తీయడం దారుణమని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభు త్వం యూరియాకు ఇష్టానుసారంగా ధరల ను పెంచడం దారుణమన్నారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్తూర్ నారాయణగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ భయంతో సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వచ్చారన్నారు.
పాలమూరు జిల్లా కు చెందిన సీఎం అయ్యి ఉండి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం దారుణమని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల నుంచి పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సింగిల్‌విండో చైర్మన్ కదిరె అశోక్‌రెడ్డి, సర్పంచులు ఆల శ్రీకాంత్‌రెడ్డి, సురేశ్, కౌన్సిలర్ గ డ్డం ప్రేమ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకు లు మనెమోని సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, గోస్లాపూర్ సత్యనారాయణ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు నర్సింహ్మగౌడ్, వెంకటయ్య, ఫసియొద్దీన్, లక్ష్మయ్య, వెంకట్రాములు, నర్సింహారెడ్డి, చెన్న య్య, సురేశ్‌గౌడ్, యాద య్య, సాధిక్ తోపాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

