భూత్పూర్, ఆగస్టు 30 : మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన కిరాణ దుకాణం వద్ద 11 నెలల బాలుడిని వదిలేసిన ఘటన చో టుచేసుకున్నది. అదే సమయంలో రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బంది బాలుడిని చూసి పోలీసులకు సమాచా రం అందించారు.
కానిస్టేబుల్ మొగుల్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని చిల్డ్రన్స్ వెల్ఫేర్ వారికి సమాచా రమిచ్చారు. వారు వచ్చి బాలుడిని సొసైటీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. బాబు వివరాలు తెలిస్తే 998 9712040 నెంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.